Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రేమ నాదం లాంటిది. మీటితే అనురాగాన్ని ఇస్తుంది.
- ప్రేమ వేదం లాంటిది. చదవగలిగితే పరిపూర్ణతను ఇస్తుంది.
- ప్రేమ స్వతహాగా రావాలి. ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించేలా చేయడం ఎవరికీ సాధ్యం కాదు.
- జీవితం పువ్వులాంటిది. అందులోని మకరందమే ప్రేమ.
- నిజానికి ప్రేమ కలిగించేంత బాధ, వ్యథ ప్రపంచంలో ఇంకేవీ కలిగించవు. రానంతసేపు రాలేదనే బాధ.. వచ్చాక విడిపోతామేమోననే బాధ. ఇదే ప్రేమంటే.
- ప్రేమ అంగట్లో దొరికే వస్తువు కాదు. అది స్వతహాగా మనసులో పుట్టుకొచ్చే పుట్టుమచ్చలాంటిది.
- ప్రేమంటే మనసును పారేసుకోవటం కాదు. ఇష్టపడిన వ్యక్తి లేనప్పుడు నవ్వుని, ఉన్నప్పుడు కాలాన్నీ పారేసుకోవడమే ప్రేమ.
- ప్రేమించటానికి మనసు ఉండాలి. ప్రేమింపబడటానికి వ్యక్తిత్వం ఉండాలి.
- ఒకరి అందం, అర్హతల వల్ల మొదట ఆకర్షణ ఏర్పడి, వారి ప్రవర్తన వల్ల అది స్నేహంగా మారుతుంది. ఆ తర్వాత వ్యక్తిత్వం వల్ల ప్రేమగా మారుతుంది.
- ప్రేమ, పైరూ ఒకలాంటివే. ముందు మనసనే భూమిని దున్నాలి. స్నేహమనే విత్తనం వేయాలి. చిరునవ్వుల ఎరువులు జల్లాలి. ఆప్యాయంతో వర్షంలా కురవాలి. అపార్థాల కలుపు తీయాలి. కులమతం, రాజకీయం అనే చీడల నుంచి రక్షించుకోవాలి. అప్పుడే ప్రేమ అనే పైరు చేతికిరాదు.
- ఇష్టం ప్రేమగా మారాలంటే దానికి గౌరవం తోవవ్వాలి.
- కళ కన్నా ప్రేమ గొప్పది. ప్రేమ కన్నా జీవితం గొప్పది.
- ప్రేమ కోపాన్ని చంపుతుంది. చిరునవ్వుని పుట్టిస్తుంది.
- ప్రేమ శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుంది.
- సేకరణ వి.సాయినాథ్, గద్వాల్