Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాధారణంగా చాలా మంది మగవారి చర్మం ఆయిల్ కలిగి, జిడ్డుగా ఉంటుంది. అలాగే వారి ముఖంలో ఓపెన్ రంధ్రాలు కలిగి ఉంటాయి. మగవారు ఎక్కువ బయట తిరుగుతుంటారు కాబట్టి దుమ్మూ ధూళి ముఖ రంధ్రాల్లో చేరి మొటిమలు, ముడతలు ఏర్పడటానికి దారితీస్తుంది. కాబట్టి మగవారి ముఖాన్నిశుభ్రపరుచుకోవడానికి కెమికల్ ఫ్రీ బ్యూటీ ప్రొడక్ట్స్‌ని ఉపయోగించడం మంచిది.
- ప్రతి రోజూ ఇంటికి తిరిగి రాగానే ముఖాన్ని మంచినీళ్లతో శుభ్ర పరచుకొని క్లెన్సింగ్ అప్లై చేయడం చాలా మంచిది.
- రోజుకు కనీసం మూడుసార్లైన ఫేస్ వాష్ క్రీమ్‌తో శుభ్రపర్చకోవాలి. అతి తక్కువ రసాయనాలు కలిగిన ఫేస్ వాష్ ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాలి.
- డియోడరెంట్స్కు సంబంధించిన ఉత్పత్తులను ముఖానికి వాడొద్దు.
- షేవింగ్ చేసిన తర్వాత అలోవెరా ఫేస్‌వాష్ చేసుకుంటే చిన్న గాట్లు ఏర్పడ్డా ఏటువంటి మార్క్స్ లేకుండా చేస్తుంది.
- ముఖ్యంగా పురుషుల చర్మం రఫ్‌గా ఉంటుంది కాబట్టి అందుకోసం విటమిన్ -ఈ ప్రోడక్ట్స్‌ను లేదా ఆలోవేరాతో తయారైన ఫేస్‌వాష్‌లతో శుభ్రం చేసుకోవాలి.
- వ్యాజ్ లైన్‌ను తరచూ పెదవులకు రాస్తుండాలి.
- ముఖం మరీ గరుకుగా ఉన్నప్పుడు తప్పని సరిగా పార్లర్‌కి వెళ్లి ఒకట్రెండుసార్లు వారి సలహాలను, వారు చెప్పిన పద్ధతులు పాటించాలి.