Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ హ దయసవ్వడిని రోజూ వింటేనే కదా
నా మనోసరస్సు స్వరగంగప్రవాహమయ్యేది
ప్రేమంటే ఇద్దరి మనసుల ఏకతాస్వరం
నీ పేరును తారకమంత్రంలా జపిస్తేనే కదా
నా మదిలో ప్రేమగీతాలు పురుడుపోసుకొనేది
ప్రేమంటే గుండెను తాకే వాసంతసమీరం
నువ్వు ఆకాశంలో జాబిల్లిలా మెరిస్తేనే కదా
నేను కలువపువ్వునై వికసించి నవ్వేది
ప్రేమంటే దూరాలను కలిపే స్నేహహస్తం
నీ స్వచ్ఛమైన చిరునవ్వుల కోసమే కదా
నేను చకోరిపక్షినై నిత్యం ఎదురుచూసేది
ప్రేమంటే కళ్ళకు తెలియని మౌనభాష
నీ ఆత్మీయ పలకరింపుల కోసమే కదా
నా మనస్సు నిరంతరం తపస్సు చేసేది
ప్రేమంటే మాటలకు అందని మూగభాష
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
9032844017