Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనుకున్నపని అనుకున్నట్టు కాకపోయినప్పుడో, అనవసరంగా హర్ట్ అయినప్పుడో ఏదో ఒక కారణంతో అప్పుడప్పుడూ మన మూడ్ మారిపో తుంటుంది. మనసంతా దిగాలుగా ఉంటుంది. ఒక క్షణం ఆనందం, మరుక్షణం దిగులు.. దీనికి కారణం ఏమిటి? ఎందుకవుతుంది? మన శరీరంలో జరిగే రసాయనిక ప్రక్రియలే మూడ్ మారటానికి కారణమని అంటున్నారు నిపుణులు. మన శరీరంలో విడుదలయ్యే అమి నోయాసిడ్స్ వల్లే మన ఉద్వేగాలు మారుతూ ఉంటాయని చెబుతున్నారు. ఇలా జరగడం వల్ల మన పనులు చెడిపోతాయి. అనుబంధాలు, స్నేహాలు చెదిరిపోతాయి. మన రూపురేఖలు కూడా మారతాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది. నెగిటివ్ ఆలోచనలు ఎక్కువవుతాయి. వాటిని అధిగమించడానికి కొన్ని పద్ధతులు పాటిం చాలని సూచిస్తున్నారు నిపుణులు.
- మూడ్ సరిగా లేనపుడు ఒంటరిగా కూర్చుని ఆలోచించొద్దు. ఇలా చేస్తే ఇంకా కుంగిపోయే అవకాశముంది. ఫ్రెండ్స్‌తో, కొలీగ్స్‌తో కలిసి పోయి మాట్లాడుతూ వారి సమస్యలు వింటూ ఉంటే, మన సమస్యలు చాలా చిన్నవిగా, సులువ్ఞగా పరిష్కరించుకోగలిగేలా ఉంటాయి.
- మీ మూడ్ బాగాలేనపుడు మీ ద ష్టిని వేరే విషయాల మీద మరల్చండి. క్రాస్‌వర్డ్ పజిల్స్, కంప్యూటర్ గేమ్స్, ఫన్నీషో ఏదైనా పర్వాలేదు. ఇష్టమైనది వినడం, పుస్తక పఠనం ఇలాంటివి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి.
- నిరాశగా ఉన్నపుడు ఏకాగ్రత ఉండదు. ఏ పని మీద దృష్టి ఉంచలేరు. అటువంటి సమయాల్లో ఉఛ్ఛ్వాస, నిశ్వాసల మీద మనసు లగం చేయండి. ఇలా కొద్దిసేపు చేసినట్లయితే మీ మూడ్ మారి ప్రశాంతతను పొందుతారు.
- జుట్టు పీక్కోవాలనంత చికాకుగా ఉంటే, జుట్టుకు నూనె రాసుకుని మీకిష్టమైన షాంపూతో స్నానం చేయండి. వీలైతే స్నానపు నీళ్లలో పరిమళాలు వెదజల్లే ఉత్పత్తులు కలపండి. ఇవి మిమ్మల్ని సరికొత్త వాతావరణంలోకి తీసుకెళ్తాయి.
- మూడ్ బాగాలేనప్పుడు ఏదో ఒక పనిలో నిమగం కండి. మీ మనసు ఊరట పొందుతుంది. గదిని శుభ్రం చేయటంలోనూ, షెల్ఫును సర్దడం లోనూ వివిధ వస్తువులను అమర్చడంలోనూ ఇలా ఏదో ఒక పనిలో బిజీ అయిపోండి. దీని వలన మీ స్తబ్దత తొలగి రిలాక్స్ అవుతారు.
- నిశ్చలంగా ఒక దగ్గరే ఉండకుండా నడవండి, కూర్చోండి, పడుకోండి, పరుగెత్తండి. శరీరం మొత్తం కదిలేలా మీకిష్టమైన ఎక్సర్సైజులు చేయండి. ఇవన్నీ మీ మెదడు మీద ప్రభావం చూపించి మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి.
- మూడ్ బాగాలేనప్పుడు మీ హాబీని కొనసాగిం చండి. పెయింటింగ్‌లు వేయడం, చిత్రాలు గీయడం, రచనావ్యాసంగం, ఇష్టమైన పాటలు వినడం, మీకిష్టమైన ఫొటో ఆల్బమ్‌లను మళ్లీ చూడటం లాంటివి చేయండి. ఇవన్నీ మిమ్మల్ని డిప్రెషన్ నుంచి బయట పడేస్తాయి. మీ మనసు ఆనందకరమైన అనుభూతిని పొందుతుంది.
- తరచూ ఫంక్షన్లకు, షికార్లకు, ఫ్రెండ్స్‌తో లేదా ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి వెళ్లండి. బాగా ఎంజారు చేయండి.
- మీరు మంచి మూడ్‌లో లేనప్పుడు మెడిటేషన్ చేయండి. ఇది మిమ్మల్ని దిగులు నుంచి సంతోషం వైపు తీసుకొస్తుంది. నెగిటివ్ ఆలోచనలు తొలగి మనసు ప్రశాంతతను పొందుతుంది.