Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందివచ్చిన అవకాశాలు అందుకోవాలి. అనుభవాన్ని పెంచుకోవాలి. ఈనాటి సామాజిక వాతావరణంలో పట్టభద్రులైన యువత ఉద్యోగ ప్రయత్నాలలో ఉద్విగ పరిస్థితులను ఎదుర్కొంటోంది. దానికి ప్రధాన కారణం అనుకున్న విధంగా అందని ఉద్యోగ అవకాశాలు. చదువుకున్న చదువుకు చేయబోయే వృత్తికి సంబంధంలేని విధంగా వున్న అవకాశాలు ఒకటైతే రెండోది చదివిన చదువులకు సంబందించిన జ్ఞానం అనుకున్న స్థాయిలలో లేక పోవటం నేటి విద్యావ్యవస్థలో స్పష్టంగా కనిపిస్తోంది!
ఈ మధ్య కాలంలో అనేక కంపెనీలలో ఉద్యోగ ఎంపిక నిపుణులకు తమకు కావాల్సిన అర్హత, ప్రతిభ వున్న అభ్యర్థులను ఎంపిక చేసుకోవటం అనేది తలకు మించిన భారంగా మారిపోయింది! దీనికి ప్రధాన కారణం విద్యార్ధి దశ నుండే నేర్చుకోవాల్సిన అనేకానేక అంశాలుండగా కేవలం మార్కుల పట్టాలకే విద్యార్ధి భవితవ్యాన్ని ముడిపెట్టి చదువుల సారం నిస్సారంగా మారుస్తోంది. అనేకానేక విద్యాసంస్థలలో నిపుణతలు లేనే నిపుణతలు కొరవడినవారే విద్యాబోధన చేయటం కూడా ఒక కారణం. పేరుకు పెద్ద పెద్ద డిగ్రీల సర్టిఫికెట్లతొ చిన్న చిన్న ఉద్యోగాలు అందిపుచ్చుకోలేని నామోషీ పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు రాని పరిస్థితులలో యువత భవితవ్యం అగమ్యగోచరం లో పడవేసి బతుకు పోటీలో యువతను ఉద్విగభరితమైన పరిస్థితులలోకి నెట్టి వేస్తోంది! అందుకే కొన్ని కంపెనీలు తమ సంస్థల ఆశయ ఆచరణలు తగ్గవిధంగా విద్యా సంస్థలను ప్రారంభించి తమకు కావాల్సిన నిపుణతలు తీర్చిదిద్దటం కొసమెరుపు. (ఇది అన్నివేళలా అందరికి సాధ్యం కానీ విషయం )
మార్కుల పట్టా మినహా మాతృభాష పైన, జాతీయ, అంతర్జాతీయ అంశాల పైన, సామాజిక సాంఘీక అంశాల పై అవసరమైన పరిజ్ఞానం కొరవడి యువత మెదళ్లలో ఎండమావులు కనిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే కుటుంబపరమైన ఒత్తిళ్లు కూడా యువత మానసిక స్థితిగతులపై ప్రభావం చూపిస్తున్నాయి.అందుకే మార్కుల డిగ్రీలకు మురిసే తల్లితండ్రులు తమ పిల్లల చదువుల విషయంలో ముందు నుంచే ఆచి తూచి అడుగులు వేసే సమయం ఆసన్నమైంది. ప్రచార పటోటాలకు దూరంగా వాస్తవానికి దగ్గరగా తమ పిల్లల చదువుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతలైనా వుంది.
సహజంగానే ప్రయివేట్ సంస్థలకు కావాలసింది ప్రతిభ, పాటవాలు. అందుకనే మనం మన అభిరుచులకు తగ్గట్టుగా ఏ సంస్థలో చేరాలన్నా దానికి తగ్గట్టుగా మన అవగాహన, నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ప్రతిభకే పట్టం! అందుకే ఏ సంస్థలో చేరినా ఆయా కంపెనీల ఆశయాలకు తగిన విధంగా ఎదగాల్సిన అవసరం వుంది లేకపోతె బతుకు పోటీలో వెనకపడక తప్పదు!
''ఏది తనంత తానె నీ దరికి రాదు శోధించి సాధించటమే ధీరగుణం''అన్నారు మహాకవి శ్రీశ్రీ ! అందుకు ఒక గొప్ప స్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ఈ యువతి ఉదాహరణ ఆదర్శంగా నిలుస్తుంది '' అంగవైకల్యం కలిగి కూడా ప్రపంచంలో మొదటి మహిళ గా కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించటం అంతేనా ప్రపంచంలో మొట్టమొదటి మహిళా విమాన చోదకురాలిగా అర్హత పొందటం పుట్టుకతోనే చేతులు లేకుండా జన్మించిన ఈ అమెరికన్ యువతి పేరు ''జెస్సికా కాక్స్'' అంగవైకల్యాన్ని సైతం ఆత్మవిశ్వాసంతో జయించి ప్రపంచం ముందు ధీరోదత్తంగా నిలబడింది. మరి అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నా కూడా తమ కోసం, తమని కన్నవారి కోసం ,తాము చేరవలసిన గమ్యం కోసం క షి, సాధన చేస్తున్న వారు ఎందరున్నారు మనలో నిజాయితీగా మనకు మనంగా ప్రశ్నించుకునే సమయమిదే. ప్రతి ఒక్కరిలో తప్పులు వెతుక్కుంటూ పొతే మనకు మనిషనే వాడు మిగలడు అలాగే ప్రతి అవకాశంలో లోపాలనే చూస్తే భవిష్యత్ లో చూడటానికి అవకాశాలుండవు అందుకనే అందివచ్చిన అవకాశాలలో నేమనక షి,సాధనాలతో, నైపుణ్యాలు పెంచుకొంటూ అద్భుతాల్ని సాధిస్తూ అందలాలు అధిరోహించవచ్చు.అదే మన కర్తవ్యమ్ గా మారాలి. సమయాన్ని వ దాచేస్తూ మానసిక సమస్యలను కొని తెచ్చుకోవద్దు .
జరిగిన నష్టాన్ని పూడ్చలేక పోవచ్చునేమో కానీ మరింత నష్టం జరగకుండా మన ముందున్న కాలాన్ని సక్రమంగా వాడుకోవటమే మన ప్రథమ కర్తవ్యం! అవకాశాలు లేవు అవకాశాలురావు అనే నిరాశా ధోరణి, అసహనాలు, ఆవేశాలు మనసులోంచి తోసి వేసి మన ముందున్న ప్రతి క్షణం విలువ తెలుసుకుని ఇప్పటికైనా ఏంచేద్దాం అని అనుకుంటూ భవిష్యత్ ప్రణాళికను రచిద్దాం! అది ఎలాగో ఒక్కసారి ఈ విషయాలను పరిశీలించండి!
సమయాన్ని వృథా చేయకుండా, మన ముందర మనకు అనుకూల మైన అవకాశాలను వినియోగించుకుందాం. ఎందుకంటె వ ధా అయినా ఒక్క క్షణాన్ని ఎన్ని కోట్లు ఖర్చు చేసినా తిరిగి పొందలేము. అనుకున్న అవకాశం రాలేదనే నిరాశా,నిస్ప హల కంటే కూడా అందివచ్చే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని నైపుణ్యం పెంచుకోవటానికి సద్వినియోగం చేద్దాం!
కనీస సర్దుబాటుతో వ్యాపకం ఏదైనా కూడా అందిపుచ్చుకుందాం ఖాళీగా ఉండి సమయాన్ని వ ధాగా మనసును వ్యథగా మార్చవద్దు! డిగ్రీ మార్కులు చూసి మురుస్తూ భావి జీవితాన్ని ఇబ్బందులలోకి నెట్టకండి అంది వచ్చిన అవకాశానికి తగ్గట్టుగా చేయబోయే పనిలో నైపుణ్యం పెంచండి ఇదే ఒక్కోసారి భవిష్యత్ లో మీరు కన్న కలలను సాకారం చేయవచ్చు. చదువు తర్వాత వచ్చే ఏ ఉద్యోగ అవకాశంలో నైనా కేవలం అందులో మీ అనుభవమే కాదు అది సమాజంలో మీ గౌరవాన్ని కూడా పెంచుతుంది ఎందుకంటె చదువు తర్వాత ఖాళీగా లేకుండా కష్టపడే తత్వానికి నాందిగా వున్నారని. అంది వచ్చే అవకాశాలు అందుకోండి భవిష్యత్లో మీరనుకున్నా లక్ష్యానికి తగ్గ ప్రణాళికలు రచించండి దానికి తగ్గ ప్రయత్నం సాధన చేయండి. మార్కుల డిగ్రీలకే పరిమితం కాకుండా సామాజిక జ్ఞానం కోసం అవసరమైన వెబ్సైట్లు, దినపత్రికలు, సబ్జెక్టుకు సంబంధించిన, జనరల్ నాలెడ్జి కు సంబంధించిన పుస్తకాల ఫై ద్రుష్టి పెట్టండి. అవకాశాలు లేవు అవకాశాలు రావు అనే మానసిక సంఘర్షణ కంటే కూడా అందివచ్చే అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేయటమే మన ముందున్న ప్రధాన కర్తవ్యమ్! వ్యాపకం లేని మనసు అర్ధంలేని, అర్ధంకాని ఆలోచనలకు నిలయంగా మారి మానసిక సమతూల్యతను దెబ్బ తీయవచ్చు. అందుకనే అందిచచ్చె అవకాశాలే ఆశాదీపాలుగా మన ప్రయత్నాలు జరగాలి. ఇవే మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నామనే ఆత్మవిశ్వాసంతో పాటు, సమాజంలో మన గౌరవాన్ని కూడా ఇనుమడింప చేయటమే కాక బతుకు బండికి భరోసాను అందించటంతో పాటు ఆత్మగౌరవం తో మనల్ని తలెత్తుకొనేలా చేస్తుంది.
- అమరనాథ్ జగర్లపూడి, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, 9849545257