Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమని విపరీతంగా ఆకర్షిస్తున్న
పురుష శిల్పం జీవం పోసుకొని,
తమవంటి దేహంగా మారి,
కదిలి, ముందుకొచ్చి,
నోటి నుండి సరాగాలని జల్లుతుంటే,
భయపడిన వారు హడలిపోతున్నారు.
ఆశ్చర్యపోయిన వారు ఆస్వాదిస్తున్నారు.
దైవత్వం అనుకున్నవారు దండం పెడుతున్నారు.
ఆలోచనాపరులు పరిశిలిస్తున్నారు.
కానీ, అందరి ప్రశ్న ఒక్కటే ''ఇది ఎట్ల సాధ్యం ?'' అని.
నీకు కూడా తెలియని ఆ సమాధానం ఏమంటే,
''నీ ముని వేళ్ళ స్పర్శ తగిలింది.'' ఈ రాయికి.
కాబట్టే, ఇట్ల నీముందు మోకరిల్లి కూర్చుంది.
నీవు తట్టిలేపిన ఈ జీవితం మీద నీకే సర్వ హక్కులు.
ఇక నీ ఇష్టం.
-నందు, 9603234503