Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీతో గడిపిన మరచిపోలేని ప్రతిక్షణం
నాకు మధురానుభూతులనే మిగిలించింది
ప్రేమంటే అమృతాన్ని ఒలికించే మకరందం
నిన్ను చేరాలని నిత్యం ఉబలాటపడుతున్నా
నన్ను నీ నుంచి దూరం చేస్తూనే ఉంటావు
ప్రేమంటే విరహవేదనకు మచ్చుతునక
నీతో ప్రేమాయణం సాగించినప్పుడల్లా
నాకు రోజూ సరికొత్త భాషనే నేర్పించావు
ప్రేమంటే అర్థం కాని మనసుల మూగభాష
నీ కోసం వెతికివెతికి వేసారిపోతూనే
నిత్యం అలసిసొలసిపోతూనే ఉంటాను
ప్రేమంటే ఎదురుచూపుల చకోరిపక్షి
నీలోని నా కోసం వెతుకుతున్నప్పుడల్లా
నువ్వు వయ్యారాలతో మరిపిస్తూనే ఉంటావు
ప్రేమంటే కోటిరాగాల హ అదయస్పందన
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
9032844017