Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏరు ఎలా ఉంటావో నీవు
నీ ఊహచిత్రాన్ని సిగ్గుతో గీసుకుని మురిసిపోతూ
ఆ రూపురేఖల చూపు స్పర్శ తాకి
మనసు వెన్నెల్లో తేలుతున్నట్లుంది
నీ ఊహల్లో ఉత్సాహాన్ని నింపుకుని
నన్ను నేను మైమరచి
మోహనరాగ సంగీతమై పులకిస్తున్నది మది
ఆ మాటతీరులో మాధూర్యాన్ని తాకిన ప్రేమే పరమార్ధం
తత్వమై నా యెద గర్భగుడిలో పూజలందుకుంటున్నది
నన్ను చేరి మురిపాల విన్నపాల
వెన్నెల ప్రేమ ముద్దలను ఆరగించి
ఏ సైనిక కావాలిలేక ఎంగిలికాక నిర్మించబడిన
నీ మధుర భావాల సామ్రాజ్యాన్ని నాకు పంచి
సంతోషాల పరువళ్ళ నదిలో సందడిచేసే క్షణాలకై
ప్రేమ మేఘాలతో మనసు రాగాలతో
ఎదురుచూస్తున్న ప్రియతమా
-అభిరామ్ ఆదోని 9704153642