Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీరు ఎంచుకున్న మీ భాగస్వామి ప్రతిసారీ 'ఐ లవ్ యూ'' అని చెప్పి నంత మాత్రాన నిజమైన ప్రేమ ఉన్నట్టేనా ? కాదు. 'ఐ లవ్ యూ' అని చెప్పకుండానే తనలోని భావాలను గమనించవచ్చు. అది నిజంగా ప్రేమేనా? లేక నటనా? అనేది కొన్ని మార్పుల ద్వారా తెలుసుకోవచ్చు.
మీరు చాలా కాలం క్రితం మర్చిపోయిన చిన్న చిన్న విషయాలను గుర్తు చేస్తుంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు నచ్చిన రంగు, నచ్చిన సినిమా, మొదటి పరిచయంలో మీరు చెప్పిన విషయాలు, మీరు చెప్పిన చిన్ననాటి జ్ఞాపకాలు, మీ పుట్టినరోజుకి మీకు ఏమి కావాలో గుర్తుపెట్టుకోవడం వగైరాలు.
మీ స్నేహితుల గురించి, బంధువుల గురించి మీరు చెప్పే విషయాలు శ్రద్ధగా వింటుంటే మీపై అమితమైన అభిమానం ఉన్నట్టు గుర్తించ వచ్చు.
మీ స్నేహితులను గౌరవించడం, మీకు ముఖ్యమైన వ్యక్తుల పుట్టినరోజు పండుగలకు హాజరవడం కూడా ఇందులో భాగమే. అయితే ఇలాంటి సందరాÄ్భల్లో తాను మీతో ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడక, మీతో చిరాకుగా ఉన్నట్లయితే మీపై ఏదో అసంత ప్తి ఉందని అర్థంచేసుకోండి.
మీకు తన అవసరం ఉన్నపుడు ముఖ్య మైన పనులను కూడా పక్కన పెట్టి మీపై శ్రద్ధ చూపిస్తున్నట్లయితే మిమ్మల్ని నిజం గానే ప్రేమిస్తున్నారన టానికి ఇది సంకేతం. ఎందుకంటే మీ అభిప్రా యాలను గౌరవిస్తూ, మీకు తోడుగా అందరూ ఉండరు కదా!.
మీకు సంతోషం కలిగించే విషయాలు, వస్తువులను ఆకస్మాత్తుగా మీ ముందు ఉంచితే తను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు అర్థం.. ఉదాహరణకు బహుమతులు అందచేయడం, ప్రత్యేక కారణం ఏదీ లేకపోయినప్పటికీ మీకు నచ్చిన కొన్ని విషయాలలో శ్రద్ధ చూపడం లాంటివి చేస్తే మీరంటే ఇష్టం అని తెలుసుకోండి.
మీ ఇద్దరి మధ్య జరిగే సంభాషణలో మీ అభిప్రాయాలను ఆహ్వానిస్తే మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు అర్థం.. ఈ బంధం మరింత అన్యోన్యంగా ఉంటుంది. ఎందుకంటే అభిప్రాయాలను గౌరవిస్తూ అండగా ఉండటం ఇష్టపడేవారికే సాధ్యం.