Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ తొలిచూపు సోకి నా మనసు మురిసె
నా బతుకులోన హరివిల్లు విరిసె
నీ అడుగులోన నే అడుగువేసి
ఏడేడులోకాలు నడవాలనుంది
నీ మనసుతో నా మనసు పెనవేసి
ఎంతెంతో కాలం గడపాలనుంది
నీతోటి గడిపే క్షణకాలమైనా
స్వర్గంలా నాకు అనిపిస్తుంది
నిను వీడి దూరంగ నేనున్న సమయం
నరకమై నా మనసుని నరికేస్తుంది
నీ పెదవివెంట వచ్చేటి మాట
వింటూనే నేను పులకించిపోయా
నీ నవ్వులో పూయు తొలిపువ్వు నేనై
మకరందధారలో మునిగిపోతున్నా.
-తిరునగరి శరత్ చంద్ర, హైదరాబాద్
సెల్ .6309873682