Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిన్నిట్ల తలచుకోవడం
నిత్యం నాకో వ్యసనమై పోయింది
కిటికీలోంచి గాలి ప్రవహిస్తున్నా
నీ కబుర్లేవో మోసుకొస్తున్నట్లే ఉంటది
ఇంటి ముందున్న పారిజాత పూల చెట్టు
జలజలా పూలు రాల్చుకుంటూ
నా ఒంటరి తనాన్ని వెక్కిరిస్తున్నట్లే ఉంటది!
ఎవరైనా పలకరింపుగా
నన్ను భోంచేశారా అంటున్నా
నువ్వు నా పక్కన లేని తనాన్ని
గుర్తు చేస్తున్నట్లుగా ఉంటది!
వంటిల్లయితే చింపిరి జుట్టు పిల్లే
నన్ను అనుక్షణం బెదిరిస్తూనే ఉంటది
ఇంటా బయటా నేనిప్పుడు
పద్మ వ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడను!
ఏదో ఒకటి చెప్పు
నువ్వొస్తావా.. నన్నే రమ్మంటావా..!!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 9440233261.