Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితంలో ఎదురయ్యే వ్యక్తులు, సమస్యలు, ఆటుపోట్లను సమర్ధవంతంగా ఎప్పటికప్పుడూ ఎదుర్కొంటూ ఒత్తిడి లేని విధంగా జీతంసాగించాలంటే భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం అనేది చాలా చాలా అవసరం. ముఖ్యంగా నేటి సామాజిక వాతావరణంలో వ్యక్తిగా, సామాజికంగా, వృత్తి, ఉద్యోగాల్లో విచక్షణతో కూడిన మాట అనేది అత్యవసరమైనది. మంచికైనా చెడుకైన పెదవి నుండి వచ్చే మాటే మన ప్రవర్తనకు గీటురాయిగా ఉంటుందనేది అక్షరసత్యం. మాటలు, ధ్వనులు, సంఘటనలు, పఠనం, దృశ్యాలు ఇలా ఎన్నో మనోభావాలకు కారణాలుగా ఉంటాయి. వీటిలో ఏవి ఎదురైనా మనం స్పందించే తీరులో సంయమనం అనేది ముఖ్యం ఎటువంటి మనిషి కైనా జీవితం అంటే వడ్డించిన విస్తరి కాదు ఈ సత్యాన్ని గుర్తులో ఉంచుకొని భావోద్వేగాలకు కళ్లెం వేయాలి.
ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితాలలో, సామాజిక సంబంధాలలో, చేసే వృత్తుల్లో భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని జాగ్రత్తగా మసలుకోవాలి. అందుకే ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో నైనా, ఎలా మసలు కోవాలనేదే మన జీవిత సాఫల్యానికి ప్రథమ పాటంగా ఉండాలి. విషయాలపై అవగాహన, తారతమ్యత, విచక్షణాలను తెలియచెప్పే విషయంలో సామాజిక వ్యవస్థ మన పాలిట ఒక యూనివర్సిటీ లాంటిది. కానీ దానికి నేపథó్యం (పునాది) కుటుంబ వ్యవస్థే అనేది మనం గుర్తెరగాలి! పిల్లల్లో చిన్నతనం నుంచే పెరిగే వయసులకు తగ్గట్టుగా భావోద్వేగాల విషయంలో అవగాహన కలుగ చేయటం అనేది పెద్దలకు చాలా అవసరం. ఈ అవగాహనే భవిష్యత్లో పిల్లల నడవడిక ప్రవర్తనలపై ప్రభావం చూపుతుంది. మనమెలా వున్నాం? ఎలా ఉండాలి ? మనం ఇతరులతో ఎలా ఉంటున్నాం? ఎలా ఉండాలి? మనలోని బలమేమిటి? మన బలహీనత లేమిటి? ఈ అవగాహనతో కూడిన విచక్షణే జీవితమనే పుస్తకంలో ప్రతి పేజీని ఆనంద మయ మైన జ్ఞాపకాలతో హాయిని నింపుతుంది. మరి ఇది సాధ్యమయ్యే పనేనా! భావోద్వేగాలను అదుపులో ఉంచు కుంటూ జీవితాన్ని ఆనందమైన వాతావరణంలో ఎలా గడపాలి! దీనికి కావలసిందల్లా చిటికెడు సహనం.
ఇది అంతా మన చేతిలోనే ఉంది ఎలాగో చూద్దామా!
ఏం చేద్దాం! ఎలా ఉందాం!
- మొట్టమొదటగా విభిన్న మనస్తత్వాల మనుషులున్న సమాజంలో మనం నివసిస్తున్నాని తెలుసుకోవాలి?
- ఇతరులతో మెలిగే విషయంలో మనకు మనంగా వ్యవహరించే తీరులో మన భావోద్వేగాల పట్ల మన పరిశీలన స్పష్టంగా ఉండాలి.
- వృత్తిలో ఎదురయ్యే సవాళ్ళలో భావోద్వేగాల అదుపు అనేది మనం ఎదగాల్సిన స్థితికి ఆలంబన అనే వాస్తవం. ఆ దిశగా మన పనిలో భావోద్వేగాలతో నియంత్రణ అవసరం.
- అనుకూల పరిణామాలలో మన విషయంలో కానీ ఇతరుల విషయంలో కానీ మన స్పందన ఏ విధంగా ఉండాలి, ప్రతికూల పరిణా మాలలో మన స్పందన ఎలా ఉండాలి అనే అవగాహన చాలా అవసరం.
- ఇతరులను వినేటప్పుడు శ్రద్ధగా, ఇష్టంతో కూడిన విధంగా ప్రశాతంగా మాట్లాడేటప్పుడు మనోభావాలను అదుపులో ఉంచుకొని విచక్షణతో కూడిన విధానాన్ని అలవరచు కోవాలి.
- చదువులో విద్యార్థులు ఇతరులతో తమను పోల్చుకుంటూ ముఖ్యంగా మార్కులు, ఆర్థిక స్థితిగతుల విషయంలో చాలా సందర్భాల్లో భావోద్వేగాలకు లోనవుతుంటారు. ఇటువంటి సందర్భాలలోనే వాస్తవంలో మన స్థితిగతులు, మనలోని సామర్థ్యాలను గుర్తుంచుకోవాలి.
- నేటి మొబైల్ ఫోన్ల సంస్కృతి భావాలను వ్యక్తీకరించే చాలా సందర్భాల్లో మన పట్ల మనం నియంత్రణ కోల్పోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి.
- భావోద్వేగాలను రెచ్చగొట్టే బుల్లితెర, పెద్దతెరల కార్య క్రమాల పట్ల హేతు బద్దంగా వ్యవహరించాలి. వాస్త వాలకు విర్ధుంగా నడిచే ఏ దృశ్యాలనైనా తిరస్కరించాలి.
- ఏదైనా సందర్భంలో భావోద్వేగానికి లోనయ్యే పరిస్థితులు ఎదురైనప్పుడు కొద్ది నిమిషాలైనా చిట్కాల ద్వారా మనల్ని మనం కంట్రోల్ చేసుకునే ప్రయత్నాలు చేయాలి. అంకెలను మననం చేసుకోవటం, గ్లాస్ నీరు తాగే ప్రయత్నం, నీటితో ముఖం తుడుచుకోవటం, మన కిష్టమైన ఏ రూపాల నైనా గుర్తులోకి తెచ్చుకోవటం, ఒకసారి గాలిని గుండెల నిండా గట్టిగా పీల్చుకొని నిధానంగా వదలటం లాంటి ప్రక్రియలు మంచి ఫలితాలు ఇవ్వవచ్చు.
- అరచేతితో అలజడి సృష్టించే నేటి మొబైల్ ఫోన్ల సంస్క తిలో భావాలను వ్యక్తీకరించే చాలా సందర్భాలలో మన పట్ల మనం నియంత్రణ కోల్పోయే పరిస్థితులు ఎదురవుతు న్నారు!
- అతిగా వాడే మొబైల్ ఫోన్స్ వలన మెదడులోని న్యూరోట్రాన్సమీటర్స్ యొక్క సమతూల్యత దెబ్బతినే ప్రమాదమే కాదు దీనివలన కచ్చితంగా భావోద్వేగాలకు గురి అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి.. భావోద్వేగాల అదుపులో మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంటి పెద్దలు, ఉపాధ్యా యులు తగిన విధంగా శిక్షణ ఇవ్వాలి. అవసరమైతే సైకాలజిస్ట్ ద్వారా బిహేవియర్ థెరఫీ కూడా ఇప్పించాలి. ఇటువంటి సందర్భాలలోనే భావోద్వే గాలను అదుపులో ఉంచుకుని మనదైన రీతిలో ఇతరు లను నొప్పించని విధంగా స్పందించాలి. మనం స్పందిం చాల్సివచ్చే ఏ సందర్భంలో నైనా మనపైన మనకు నియం త్రణ అనేది చాలా అవసరం అదే భావోద్వేగాలు అదుపులో ఉండటం అంటే!