Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేమికులు ఒకరికొకరు ఆకర్షించుకునేందుకు అనేక పద్ధతు లుంటాయి. ఒకర్ని ఒకరు ఇంప్రెస్ చేసుకోవడానికి చేసే పనులు అన్నీ ఇన్నీ కాదని అమెరికాకు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ప్రేయసి కబుర్లకు, ఆమె ప్రశంసలకు ప్రేమికుడు పడిపోవాల్సిందేనట. అయితే.. ప్రియుడిని ఆకట్టుకోవడానికి ప్రేయసి ఏం చేస్తుందో పరిశోధకులు తేల్చిన విషయాలు కొన్ని..
- ప్రియుడు తన మనసులోని మాటలను చెప్పలేక సతమతమవుతున్నప్పుడు ప్రేమ మైకాన్నంతా గొంతులో పూరించి తన తీయటి స్వరంతో అతడిని మహా ఉత్తేజ పరుస్తుంది.
- ప్రేమికుడి ఇష్టమైన రంగులేమిటో తెలుసుకుని ఆ దుస్తులను ధరిస్తూ ప్రేమికుడి మనస్సును ఆక్రమిస్తుంది.
- సాయంత్రం వేళల్లో వీలున్నప్పుడల్లా అతడిని కలుసుకో వడానికి గంటల కొద్దీ సమయాన్ని వెచ్చిస్తుంది. ఆ సమయంలో తీయని ప్రేమ కబుర్లు చెబుతుంది.
- పొరపాటున పిలిచిన సమయానికి రాలేకపోయినప్పుడు ప్రియురాలిపై ప్రియుడు అలిగే అవకాశం ఉంది. ఆ సమయంలో మంచి పెర్ఫ్యూమ్ చల్లుకుని అతడు తనపై కోపాన్ని ప్రదర్శించక ముందే తన కనుల ద్వారా ఆమె ప్రేమ మైకాన్ని నింపి చుట్టేస్తుంది.
- నడిచి వెళ్తున్న సమయంలో ప్రేమికుడి చేతిని తన చేతిలోకి తీసుకుంటుంది.
- పరిచయమైన తొలి రోజుల్లో అన్ని రకాలు పూలు అలంకరిం చుకుంటుంది. వాటన్నింటిలో ఏదో ఒక రకమైన పుష్ప జాతులు అంటే తనకు ఇష్టమని ప్రియుడు చెబుతాడు. అతడు చెప్పిన ఆ పూల రకాలనే ధరించడం మొదలెడుతుంది.