Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజంలో నిత్యం మనం విభిన్న మనస్తత్వాలు, ఆలోచనలు కలిగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాం. సహజంగా వ్యక్తికి వ్యక్తికి మధ్య ఆలోచనా సరళిలో అనేక వ్యత్యాసాలు ఉండవచ్చు. ఇటువంటి సందర్భాలలో మనం ఇతరులతో మెలిగేటప్పుడు అత్యంత జాగురూకతతో వ్యవహరించవలసి ఉంటుంది.దీనికి మన మీద మనకు అవగాహన ఎంత ముఖ్యమో ఇతరుల పట్ల కూడా మనకు అవగాహన ఉంటూ మన పరిధి మేరకు మెలగాల్సి ఉంటుంది. అప్పుడు మన ఆత్మగౌరవం మనం కాపాడుకోవటమే కాదు ఇతరుల ఆత్మగౌరవం కూడా కాపాడినట్లవుతుంది.
వాస్తవానికి సామాజంలో నీతి,నియమాలకు,సామాజిక ,సాంఘిక కట్టుబాట్లకు, ప్రజా సంక్షేమాలకు తగ్గట్టుగా ప్రభుత్వ పరిపాలనాలు ఉంటే అవినీతి,అనైతికలకు ఆస్కారం ఉంటుంది.
మన ఆత్మగౌరవం మన చేతుల్లోనే!
1.ఏ రకమైన చర్చల్లో నైనా వ్యక్తిగత విషయాలకు, దూషణలకు పాల్పడరాదు. ఇది చర్చించే అసలు విషయాన్ని పక్క దోవ పట్టిస్తుంది.
2.ఇతరులతో చర్చ లేదా సంభాషణలు చేసే ప్రతి సందర్భంలో మనకి ఎప్పటి కప్పుడు సామాజిక మార్పు చేర్పులకు సంబంధించిన అవగాహన చాలా అవసరం. పడికట్టు పదాలతో చర్చలలో పాల్గొనటం అసంబద్ధంగా ఉంటుంది.
3.మారుతున్న కాలానికి తగ్గట్టుగా మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకుంటూ, తెలియక పొతే తెలుసుకుంటూ వ్యవహరించటం చాలా అవసరం.
4.వ్యక్తుల వ్యక్తిగత రూపాలకు కాదు(ూష్ట్రyరఱషaశ్రీ ూవతీరశీఅaశ్రీఱ్y) చర్చించే విషయాన్ని పారదర్సకతోతో అర్థం చేసుకొని దానికే ప్రాధాన్యతని ఇవ్వటం.
5.నా స్థాయి, నా దర్పం, నా జ్ఞానం అనే ధోరణిలోతో కాకుండా ఇతరులను కూడా వినటానికి ప్రయత్నించాలి కానీ అవతలివారి నోట్లో నుంచి మాట వచ్చీ రాక ముందే మన కంతా తెలుసుననే ఖండనలుపనికిరావు. మీరు చెప్పేది ఇతరులుఎలా వినాలనుకుంటారో అలాగే ఇతరులు చెప్పేది మీరు వినే ధోరణీలో ఉండాలి లేకపోతె ఇతరుల ఈగో ఖచ్చితంగా దెబ్బతింటుంది.
6.ఇతరులతో చర్చ లేదా ఏ సంభాషణ యైనా కూడా గెలవాలనే వితండవాదం కంటే కూడా వాస్తవికతకే ప్రాధాన్యత ఇవ్వాలి వాస్తవాన్ని విజ్ఞతతో స్వీకరించాలి.
7.వ్యక్తిగత దూషణలు, కించ పరచటాలు, అనవసరమైన ఉదాహరణలు చొప్పించటం లాంటివి చేయరాదు చర్చల అనంతరం ద్వేషాలకి, కక్ష, కార్పణ్యాలకు తావివ్వరాదు.
7.మన ఆత్మగౌరవం మన కెంత ముఖ్యమో ఇతరుల ఆత్మగౌరవం వారికంత ముఖ్యం కనుక చర్చ లేదా సంభాషణలలో సున్నితత్వం అవసరం. లేని పోనీ డాంబికాలతో ఇతరుల మనసును నొప్పించరాదు.
8.మన ఆత్మగౌరవం మన కెంత ముఖ్యమో ఇతరుల ఆత్మగౌరవ పరిరక్షణకూడా మనకు అంతే ముఖ్యం''తమలపాకు తో నువ్వొకటంటే తలుపు చెక్కతో నీరెండంటా'' అనే ధోరణి తిరిగి ఘర్షణకు దారి తీస్తుంది. అందుకే ఒక మనిషిని ఒక మనిషి గౌరవించట మనే సంస్కారానికి శ్రీకారం చుట్టాలి.
9.జీవితంలో అత్యంత సున్నితమైనది, సంక్లిష్టమైనది ఈ ఈగో అనబడే ఆత్మగౌరవం అందుకే దీనిని మనం పరిణితితో కాపాడు కోవాలి. అదే సందర్భంలో ఇతరుల గౌరవాన్ని కాపాడుతూ ఫలితం ఏదైనా హుందాగా వ్యవహరించాలి.
10. జీవితంలో ప్రతి ఒక్కరికి అత్యంత అవసరమైనది ఎప్పుడు! ఎక్కడ !ఎందుకు!ఎవరితో! ఎలా! అనే విచక్షణ ఇదే జీవితాన్ని విజయవంతంగా నడిపే తారక మంత్రం అనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
సామాజిక, రాజకీయ,సాంస్క తిక,సాంకేతిక ఇలా ఏ రంగాలలో పనిచేసేవారైనా ఏ స్థాయిల్లో ఎదిగిన వారైనా, ఎటువంటి మనస్తత్వం కలిగిన వారైనా కూడా తమకు తామే గెలవాలను కుంటారు. నిజానికి ఎదిగే కొలది ఒదిగి ఉండాలనే చరిత్ర చెబుతుంది. సహనం,సంయమనం, భావోద్రేకాలు నియంత్రణ, విషయాన్నిహేతుబద్దంగా అర్థం చేసుకునే మనసు కలిగినవారే వాస్తవాన్ని ఎటువంటి భేషజాలు లేకుండా అంగీకరించి ఆచరణలోకి తేవటానికి ప్రయత్నిస్తారు. ఇటువంటి నిఖార్సైన వ్యక్తిత్వం కలవారు మాత్రమే విజ్ఞతతోవ్యవహరిస్తూ హుందాగా తమ ఆత్మగౌరవాన్ని నిలుపుకొనే ప్రయత్నం చేస్తారు. ఔనంటారా!