Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిలిపి ప్రశ్న
సుబ్బారావు: ఏరా బావా... నీ కొడుకు ఎప్పుడూ వేలు చప్పరిస్తూ ఉండేవాడు. ఇపుడు అలవాటు తగ్గిందా?
వెంగళప్ప: ఆ తగ్గిందిరా... ఇప్పుడు అస్సలు పెట్టుకోవడం లేదు.
సుబ్బారావు: ఎలా మాన్పించావురా?
వెంగళప్ప: అబ్బే ఏం లేదురా... వాడికి లూజుగా ఉండే నిక్కర్లు కుట్టించాను. వెదవకి నిక్కరు పట్టుకోవడంతోనే సమయం సరిపోతుంది. ఇక వేలేం చప్పరిస్తాడు.
లెక్క తప్పుంటది
రాము: నాకెందుకో చాలా భయం భయంగా ఉంది... మామూలుగా 19 తర్వాత 20 వస్తుంది... అవునా!
చందు: అవును... అయితే ఇప్పుడేమైంది..
రాము: ఈ సంవత్సరం ఏంటో 20 తర్వాత 19 వచ్చింది. 2019 అంటా! ఏమైనా అవుతుందా...
చందు: ఏమవుతుంది. ఏమీ అవదు. అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు. లెక్క తప్పుంటది పిచ్చోడా..!
నువ్వే చెప్పు
వినటానికి ఎదురుగా లేవు గానీ,
ఎన్నో విషయాలు చెప్పాలని ఉంది.
నా ముందు లేవు గానీ ,
మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది.
ఎక్కడున్నావో తెలియదు గానీ ,
ఇప్పటికిపుడు నీ ముందు వాలాలని ఉంది.
చెబితే నమ్మవు గానీ,
ప్రతీక్షణం నీ ధ్యాసే అయింది.
ప్చ్......!
ఏం చేయాలి ? - నందు
బేడీలు!?
మరోసారి
నా గుండె దర్వాజ పై
తలుపు తాడించకు ప్రియా!
ఇప్పుడిప్పుడే కిటికీ తెరిచాను..
ఆకాశంలోకెగిరి
దేదీప్యమానంగా
వెలుగుతూన్న ప్రేమ జ్యోతిని
నీకివ్వాలనే ధైర్యానికి
శిక్షననుభవిస్తున్నాను
చేతులకే కాదు
కాళ్లకు కూడా పడ్డాయి
కుల-మత బేడీలు?
- అమ్జద్