Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదా....?
చిన్నపుడు నువ్ మాటలురాని ఏడుపులో అడిగితేనే పాలు ఇచ్చిందా..?
ఫారెక్స్ డబ్బాలు నువ్ అడిగితేనే పెట్టిందా..?
గోరు ముద్దలు కలిపి
ఇదీ తాత ముద్దా... ఇది అమ్మమ్మ ముద్దా... అని పేరు పెట్టీ మరీ రాని చంద్రుని సాక్షిగా నువ్ అడిగితేనే పెట్టిందా..?
బడికి వెల్లెటపుడు నువ్ అడిగితేనే పెట్టిందా..?
అన్నం బెల్ల తినడానికి నువ్ అడుగుతావనే డబ్బా ల పెరుగుతో కలిపి సద్దన్నం పెట్టిందా...?
బడి వదిలాక నువ్ అడిగితేనె అన్నం పెట్టీ చారు పోసిందా...?
ఆదివారం నువ్ తినకుండా బ్యాటు పట్టుకుని పోతుంటే తిని పొమ్మన్నది నువ్ అడిగితేనె అన్నదా...?
నువ్ వచ్చినంక నీకు తిన పెట్టిన తర్వాత తాను తినేది కూడా నువ్ చెప్తెనేనా/అడిగితేనె పెట్టిందా..?
ఒక్కపొద్దులొ కూడా తన కోసం తెచ్చిన పండ్లను, నాకు ఆకలి ఐతలేదనే అబద్దాన్ని తను తినీ,
నీ కడుపు నింపడం కూడా నువ్ అడిగితేనె చేసిందా..?
ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల ఉన్నా,
నీ కడుపు నిండిందా అని చూసే కడుపు తీపి పేగు బంధంరా అయ్యా అదీ...!అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదా...?
- రామ్ కిషన్ జీ,
9581072143