Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మాయిలు సహజంగా ఎలాంటి అబ్బాయిలను లైక్ చేస్తారు ? అనే అంశంపై చాలా పరిశోధనల్లో రకరకాల ఫలితాలు వచ్చాయి. కొంతమంది అమ్మాయిలు మ దుస్వభావులైన అబ్బాయిలను ఇష్టపడతారని అంటే మరికొందరు మాత్రం స్టైలీష్‌గా ఉండే అబ్బాయిలను ఇష్టపడతారని చెపుతుంటారు. ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా ఓవరాల్‌గా మాత్రం ఈ కింద పది క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువుగా ఇష్టపడతారని ఓ సర్వేలో స్పష్టమైంది. మరి ఆ పది క్వాలిటీస్ ఏంటో చూద్దాం.
- అబ్బాయిలు చాలా ధైర్యంగా ఉండాలట. ఎప్పుడైనా పని ఏదైనా సరే సింహమంత ధైర్యంతో చేయగలగాలట.
- అబ్బాయిలు తమజీవితంలో ప్రతి విషయంలో చాలా జాగ్రత్త పాటించేవారై ఉండాలి. ముఖ్యంగా తన జీవిత భాగస్వామి విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్త వహించాలి.
- ఉదయాన్నే నిద్రలేచే వ్యక్తి ఇతరులను కూడా ప్రోత్సహిస్తాడు. అందుకే అబ్బాయిల్లో ఉదయమే నిద్రలేచే అలవాటు ఉండాలి.
- కష్టమైన పని వచ్చినప్పుడు అది కష్టమని భావించకుండా, నటన చూపించకుండా, భయపడకుండా హార్డ్ వర్క్ చేసే వారిని అమ్మాయిలు బాగా ఇష్టపడతారట.
- ఫ్యామిలీ, ఫ్రెండ్... ఈ రెంటినీ గౌరవించే వ్యక్తి అయి ఉండాలి.
భాగస్వామి అవసరాలు తెలుసుకోవాలి. వాళ్ళ కోరికలు తెలుసుకుని నెరవేర్చడానికి ప్రయత్నించేవాడై ఉండాలి. తన భాగస్వామిని అమితంగా ప్రేమించేవాడై ఉండాలి.
తన రిలేషన్, వ్యక్తిగత వర్క్‌లైఫ్ అన్నింటి వల్ల వచ్చే అపాయాల రిస్క్‌ని అర్థం చేసుకోగలిగే వ్యక్తి అయి ఉండాలి. ప్రేమ విషయంలో ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడగలిగేటట్టు ఉండాలి.
తమ భాగస్వామితో గడిపిన స్వీట్ మెమరీస్, ఇష్టమైన విషయాలు గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓర్పుగా ఉండాలి.
అ- బ్బాయి వద్ద నిజాయితీగా ఉండాలి. ఆర్థికంగా, సామాజికంగా భరోసా ఇచ్చేలా ఉండాలి.
- చేసే పనిలో శ్రద్ధ ఉన్న అబ్బాయ్నై ఉండాలి. ఒక లక్ష్యంతో పనిచేయగలిగే లక్షణం కలిగి ఉండే అబ్బాయి కావాలని అమ్మాయిలు కోరుకుంటున్నారట.
- మరి మీలో ఈ 10 క్వాలిటీస్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.