Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి యువత ఫ్యాషన్, కొత్తస్టైల్ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వాటికి అలవాటు పడుతూ ఆచరిస్తున్నారు. డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటారు. పెద్ద పెద్ద పట్టణాల్లో, నగరాల్లో ఆధునికత మెండుగా కనిపిస్తోంది. యువకులు ఇప్పుడు నేరుగా వెంట్రుకలు కట్ చేసుకోవడానికి బదులు వెంట్రుకలకు ఓ మంచి లుక్ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 'డౌన్ లుక్', 'డీసెంట్ లుక్', 'డ్యూడ్ లుక్', 'హాట్ లుక్'... ఈ ఇలా రకాల హెయిర్‌స్టైల్స్ యువకుల్లో ట్రెండ్‌గా మారాయి. కానీ ఏ స్టయిల్ ఎన్నుకున్నా దానికన్నా ముందు తమ ముఖ ఆకృతిని నిశితంగా పరిశీలించుకోవాలి. మరి ఎవరికి ఏ స్టైల్ బాగుంటుందో చూద్దాం...
గుండ్రని, విశాలమైన ముఖం ఉన్న యువకులకు 'స్పైకీ హెయిర్ కట్' ఒక మంచి లుక్‌ను అందిస్తుంది. ఈ కట్లో వెంట్రుకలను ముందువైపు నుండి నేరుగా పైకి తీసుకువెళతారు. 'స్పైకీ హెయిర్ కట్' టీషర్ట్ కంటే కోటు, జాకెట్ పై బాగా సూట్ అవుతుంది.
కోలముఖం ఉన్న యువకులు స్పోర్టీ లుక్ కోరుకుంటే 'ఫంకీ హెయిర్ కట్' చేయించుకోవచ్చు. దాంతో పాటు నుదురు, చెవుల దగ్గరి వెంట్రుకలకు, ప్లైట్ కట్ చేయించుకోవచ్చు. ఇలా చేస్తే వెంట్రుకలు జిగ్ జాగ్ షేప్‌లో నుదుటిపై వేలాడుతూ ముఖాన్ని చిన్నగా అనిపించేలా చేస్తాయి. అలాగే మెడ పొడవుగా ఉన్నట్లైతే వారి అందాన్ని తగ్గిస్తుంది.
మెడ పొడవుగా ఉంటే 'పెంచ్' ఉంచుకోవాలి. దాంతో మెడ చిన్నగా కనిపిస్తుంది. చిన్న మెడ ఉన్నవారు వెనుకవైపు పొడవైన వెంట్రుకలు ఉంచుకుంటే మెడ పొడవు మరింత తక్కువగా కనిపిస్తుంది. కాబట్టి వెనుక భాగం వెంట్రుకలు చిన్నవిగా ఉంటేనే మంచిది. 'ఆర్మీ కట్' చిన్న మెడ ఉన్న యువకులకు బెస్ట్ కట్. వీటితో పాటు 'కాప్ కట్', 'మష్రూమ్ కట్' కూడా ఎంపిక చేసుకోవచ్చు.