Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలామందికి అర్ధరాత్రిళ్లు ఏదో ఒకటి నోటిలో పడితేగానీ.. టైంపాస్ కాదు. అలా తినకపోతే కడుపు ఆకలిగా అనిపించి నిద్ర కూడా పట్టదు. నేటి టీనేజర్లలో ఈ అలవాటు బాగా ముదిరింది. సెల్ఫోన్లో చాటింగ్‌లు చేసుకుంటూ ఆహార నియమాలు పాటించకుండా ఏది పడితే అది తినేస్తున్నారు. దీనివల్ల వెంటనే సమస్యలు రాకున్నా.. భవిష్యత్తులో దీర్ఘకాలిక వ్యాధులబారిన పడే ప్రమాదం ఉందని ఆహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం...
ఫ్రెంచ్ ఫ్రై, బంగాళా దుంప చిప్స్: నూనెలో బాగా వేయించే ఫ్రెంచ్ ఫ్రై, బంగాళా దుంప చిప్స్ ఆరోగ్యానికి చేటు. వీటిలో కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి. శరీరం వీటిని జీర్ణం చేసుకోడానికే ఎక్కువ శక్తిని ఖర్చు పెడుతుంది. దీనివల్ల నిద్ర పట్టదు. పైగా గుండెలో మంటగా ఉంటుంది.
టీ: రాత్రిళ్లు నిద్రకు ముందు కప్పు టీ తాగడం మంచిది అనుకుంటారు. కానీ అది ఏమాత్రం మంచిది కాదు. గ్రీన్ టీ, లెమన్ టీ.. ఇలా ఏ టీ అయినా సరే ప్రమాదకరమే. అందులో ఉండే కెఫిన్ మీ నిద్రకు భంగం కలిగిస్తుంది. అర్ధరాత్రులు అతి మూత్ర సమస్య రావచ్చు.
ఐస్ క్రీమ్: రాత్రి వేళల్లో ఐస్ క్రీమ్‌ను ఆశ్వాదించే అలవాటు చాలామందికి ఉంటుంది. యువకుల్లో ఇది ఓ స్టైల్‌గా మారిపోయింది. అయితే ఐస్ క్రీమ్‌లోనూ కొవ్వుల శాతం ఎక్కువ. దీనివల్ల జీర్ణ సమస్యతోపాటు యాసిడ్ రిఫ్లక్షన్ ఏర్పడుతుంది.
పిజ్జా: మిడ్నైట్ పిజ్జా అస్సలు వద్దు. పిజ్జాలో కూడా కొవ్వు శాతం అధికం. నిద్రకు ముందు వీటిని తిన్నట్లయితే జీర్ణ సమస్య, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి.
చాక్లెట్లు: రాత్రి వేళ్లల్లో చాక్లెట్లు తినొద్దు. వాటిలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల నిద్ర పట్టదు. నిద్రపోయే ముందు లైట్ ఫుడ్ తీసుకోవడమే మంచిది.
కూల్ డ్రింక్స్: రాత్రి వేళ్లల్లో కార్బోనేటెడ్ (జీరో క్యాలరీలు ఉండే డ్రింక్స్) అస్సలు తాగొద్దు. వీటివల్ల జీర్ణక్రియ సమస్యలు వస్తాయి.