Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒంటరితనానికి ఆమె తోడవగా
జంటగా ఏడడుగులు వేశాం!
స్వర్గానికి చేరువలో మేం!
కాలానికి కళ్ళెమేయాలని
ప్రయత్నించి విఫలమయ్యాను!
తను నవ్వింది కాలం ఆగింది!
నిన్ను కలిసిన ప్రతి సారీ
నా మనసు నీ పాదాల చుట్టే!
నన్ను నడిపిన అడుగులు కదా!
నా జ్ఞాపకాలన్నీ నీ చుట్టూ భ్రమరాలై
నిరంతరం పరిభ్రమిస్తున్నాయి..
బతుకంతా ఋతువుల శోభ!!
- వెన్నెల సత్యం,
9440032210