Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీకిది కేవలం పుట్టిన రోజే కావొచ్చు
నాకు మాత్రం పునర్జన్మ లభించిన రోజు
నా చీకటి బతుకులోకి
దీపమై అడుగు పెట్టారు
నా దిగులు మేఘాలను చల్లార్చి
చిరుజల్లయి కురిసి
నా గుండె మంటను చల్లార్చారు
మనసు గాయాలను మాయం చేసి
నీ సన్నిధిలో స్థిమిత పరిచారు
కష్టాలను పంచుకొని
కన్నీళ్ళనూ సగం ఒంపుకున్నారు
ఎందుకు బతుకుతున్నానో తెలియని నాకు
మీ చిరునవ్వు కోసం
బతకాలనే ఆశ కలిగించారు
నిర్భాగ్యురాలనైన నన్ను
సంపూర్ణ సౌభాగ్యవతిని చేశారు
ఇన్ని ఇచ్చిన మీకు
నేనేం చేయగలను
మీ చిరునగుమోమును
నా గుండెనిండా నింపుకుంటాను
మీరు పంచిన ప్రేమను జన్మ జన్మలకూ
సరిపడా దాచుకుంటాను
మీరిచ్చిన జ్ఞాపకాలనే
ఊపిరి చేసుకొని బతికేస్తాను
మనప్రేమకి గుర్తుగా మీరు వేసిన
మూడు ముళ్ళలో మిమ్మల్ని చూసుకుంటాను
మీరు చెప్పిన ఊసులన్నీ
గుండె గదిలో భద్రంగా దాచుకుంటాను!!
- మంజుల కులకర్ణి,
హైదరాబాద్