Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డెలివరీ బారుసాయం చేయాలన్న మనసుండాలే కానీ.. ఉద్యోగం చిన్నదా, పెద్దదా అనే ఆలోచన రాదు. ఈ యువకుడు చేసేది డెలివరీ బారు ఉద్యోగమే అయినా.. బిలియన్ డాలర్ల విలువ చేసే మంచి మనసును బయటపెట్టాడు. ఇంతకీ ఏం చేశాడో తెలుసా..
జొమాటోలో పనిచేసే ఈ అబ్బాయి పేరు పతిక్రీత్ సాహా. అందరూ రోల్ కాకుగా పిలుస్తారు. ఇతడిది కోల్‌కతా. ప్రతిరోజూ జొమాటోలో వచ్చిన ఆర్డర్స్ కస్టమర్లకు డెలివరీ చేస్తూ. బిజీగా ఉంటాడు. చేసేది చిన్న ఉద్యోగమే అయినా.. ఆలోచనల, సాయం చేసే గుణంలో పెద్ద మనసును చాటుకుంటున్నాడు. మూడు చక్రాల వాహనం మీద ఆర్డర్లు సప్లై చేస్తూ క్యాన్సల్ అయిన ఫుడ్ ఆర్డర్లను ఆ చుట్టుపక్కల ఉండే పేద పిల్లలకు, మురికివాడల పిల్లలకు ఉచితంగా ఇస్తున్నాడు.
అసలు ఇతనికి ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే...నాలుగేండ్ల కిందట కోల్‌కతాలోని డుమ్ డుమ్ కంటోన్మెంట్ వీధుల్లో ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు. ఆ సమయంలో ఓ అబ్బాయి పతిక్రీత్ దగ్గరికి వచ్చి కాళ్ల మీద పడి 'అన్నా ఆకలేస్తుంది. ఏమైనా పెట్టవా' అని అడిగాడు. ఆ కుర్రాడి మొఖం పరీక్షగా చూసిన తర్వాత పతిక్రీత్కి ఓ విషయం ఆర్థమైంది. ఆ కుర్రాడు డ్రగ్స్‌కి అలవాటు పడ్డాడు. డబ్బులిస్తే డ్రగ్స్ కొనుక్కుంటాడని ఆలోచించి ఆ కుర్రాడి చెంప మీద బలంగా కొట్టాడు. ఆ కుర్రాడు ఏడుస్తుంటే.. పతిక్రీత్ చాలా బాధపడ్డాడు. అక్కడ మొదలైంది.. పతిక్రీత్లో మధనం.
అప్పటి నుంచి అలాంటి కుర్రాళ్లు ఎక్కడ కనిపించినా చదువు చెప్పిస్తుంటాడు. వారికి అన్నం తినిపిస్తుంటాడు. చెడు అలవాట్లు మాన్పించి, దొంగతనాలు, డ్రగ్స్ రాకెట్లో చిక్కుకోకుండా వారికి చిన్నపాటి ఉపాధి మార్గం చూపిస్తున్నాడు. ఈ పని చేయడానికి పతిక్రీత్ మున్సిపాలిటీలో ఉద్యోగం మానేసి జొమాటోలో చేరాడు. హోటల్ నుంచి కస్టమర్లు బుక్ చేసుకున్న ఫుడ్ ఆర్డర్ క్యాన్సిల్ అయితే దాన్ని హోటల్‌కి తిరిగివ్వకుండా ఆకలితో బాధపడే పిల్లలకు ఇచ్చేందుకు హోటల్ యజమాన్యాలతో ఒప్పందం చేసుకున్నాడు. ఒకరు క్యాన్సిల్ చేసుకున్న ఆహారాన్ని మరొకరి కడుపు నింపడానికి ప్లాన్ చేసిన పతిక్రీత్ ఆలోచన బాగుంది కదా!