Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా తప్పులు ఒక్కసారి మన్నించవె ఓ సఖీ
నీ మనసును నామీదకు మళ్ళించవె ఓ సఖీ!
హృదయమంత వేదనతో భారంగా మారింది
బతుకులోని కష్టాలను భాగించవె ఓ సఖీ!
అంటరాని అనుబంధం అగ్నిలాగ మండింది
ఎదనిండా సుధలెన్నో కురిపించవె ఓ సఖీ!
పాఠాలను నేర్చుకోక ఫలితమిలా వచ్చింది
పసివాడిని సున్నితంగ దండించవె ఓ సఖీ!
ఎన్నాళ్ళీ ఎడబాటని ప్రశ్నించెను 'వెన్నెలా'
మనమధ్యన దూరమంత పూరించవె ఓ సఖీ!!
-వెన్నెల సత్యం, షాద్నగర్
9440032210