Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వప్నమా
కలల కావ్యమా ...అందమైన ప్రబంధమా ...
ఊయల ఊపిరికి ప్రాణం పోసే జీవమా ..
పగలంతా అలిసి సొలిసిన మనసు
హాయిగా సేదతీరే వేళా...
నేనున్ననంటూ నేస్తమై వస్తావు ..!!
అందమైన వెన్నెల పానుపుపై
నిదురోతుంటే చల్ల గాలి జో కొడుతుంటే
తనువు మరిచి తన్మయత్వంలో
జారుకునే సమయంలో
మది ముంగిట నిలుస్తావు..!!
ఊహల లోకంలో విహరింపజేస్తూ
మాయ జాలంలో ముంచెత్తుతావు..
రెక్కలు తొడిగిన పక్షిలా
గగన సీమలో విహరిస్తూన్నట్టు ..
అందని ఆకాశాన్ని హత్తుకున్నట్టు
చందమామని బంతిలా చేసుకోని ఆడుతున్నట్టు ..
నక్షత్రాలతో చిలిపి కబుర్లు ..
వెండి వెన్నెలని దుప్పటిలా చుట్టుకున్నట్టు ..
ఎన్నో తెలియని భావ కథలు..
కునుకు తీసే సమయంలో కోటి ఊహలు
వేల భావాలు
మదిని తట్టి లేపే మధుర జ్ఞాపకాలు ..
మురిపిస్తావూ ..మరిపిస్తావూ ..
కవ్విస్తావూ ..కలత చెందిస్తావూ
నవ్విస్తావూ..చిలిపి ఆశలు రేపుతావు..
నీకే సాధ్యమేమో ..స్వప్నమా ..
కల అయిన ..నిజ మయిన ..
ఓటమి ఎదురైనా గెలుపుకి బాసటగా ..
బరువెక్కిన హృదయాన్ని ..తేలిక చేస్తూ ..
అందలం ఎక్కిస్తావు ..అడుగున తొక్కేస్తావూ ..
అన్ని నీతోనే ..కలలో ఇలలో ..అన్ని నువ్వే ..
- స్వప్న మేకల
9052221870