Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిన్ను కలిసిన
ప్రతి సారీ
నా మనసు
నీ పాదాల చుట్టే
నన్ను నడిపిన
అడుగులు కదా!!
నా జ్ఞాపకాలన్నీ
నీ చుట్టూ భ్రమరాలై
నిరంతరం
పరిభ్రమిస్తున్నాయి
బతుకంతా
ఋతువుల శోభ!!
ఏటి ఒడ్డున
గులక రాళ్ళకి
ఆ నునుపుదనం
ఎక్కడిదో
నీ పాద స్పర్శ
మహిమ కాబోలు!!
- వెన్నెల సత్యం
9440032210