Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాలిపోని హృదయ మందిరం
నీ వాలు చూపు కళ్ళకు సోలిపోగా
బెదరని మనో కుహరం
నీ సొగసుల సోయగాలకు కూలిపోగా
వెరవని వేదన రహిత తనువు
నీ వాడిపోని సౌందర్యానికి శిథిలమవగా
అలజడే ఎరుగని ఆలోచనే
నీ కురుల జడులలో చిక్కుకోగా..
చెదరని చిరుదరహాసమే
నీ చెక్కని శిల్పానికి మై మరచిపోగా..
వదలని శాంతి స్మృతి సైతం
నీ వదనపు సమీరానికి చెదిరిపోగా..
కల్లోలానికి కడుదూరపు కలలే
నీ చల్లని చిత్రానికి సాగిలపాడిపోగా..
తపనల వర్షపు జడివానలో
విరహపు జ్వాలల అగ్నిశిఖలలో
యెద పొంగినందుకు పులకించాలో
వేళ తప్పినందుకు విలపించాలో
నీవు కరుణించావని కలగనాలో
హరివిల్లై మెరిసావని మురవాలో..
తెలియక..
అందీ అందని దూరపు బంధానికి
బందీనై నీ వెలుగు రేఖల ప్రసారానికై
ప్రత్యూషపు తరంగమై పరితపిస్తున్నా..!
- గుండేటి రమణ
9949377287