Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీస్వరమే సుమసరమై పలకరించె ఈ వేళ
మది వనమే మయూరమై పులకరించె ఈ వేళ
మబ్బులోన జాబిలివై మసకబారి నీవుంటె
ఎంతగానో నిన్ను నేను కలవరించె ఈ వేళ
బతుకంతా నీ అడుగులు జాడలుగా కనిపించె
మధుమాసపు కోయిలనై అనుసరించె ఈ వేళ
కాలమిపుడు ఇచ్చెనులే ఏనాటిదో ఈ తీరుపు
మౌనమిపుడు వదిలెనులే పలవరించె ఈ వేళ
దూరమైన శాంతి కొరకు వెతుకుతావు నీవిపుడు
ఎదుటనున్న నన్ను గాంచు మదివరించె ఈవేళ !!
- శాంతికృష్ణ,
9502236670.