Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాక్యుమెంట్లు అన్నీ ఉన్నా...
కొత్త ట్రాఫిక్ జరిమానాలు కట్టలేక జనాలు సతమతమవుతున్నారు..
వెంకటేష్ తన బైక్‌పై అన్ని డాక్యుమెంట్లతో వెళ్తుంటే ట్రాఫిక్ పోలీసులు ఆపారు..
చాలా సంతోషంగా ఒక్కో పేపర్ తీసి పోలీసులకు గర్వంగా చూపించాడు వెంకటేష్...
ఇకవెళ్లవచ్చా సార్ అని అడిగిన వెంకటేష్‌కు ట్రాఫిక్ పోలీసులు రూ.5 వేల చలానా రాసేసరికి కంగుతిన్నాడు..
అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి కదా.. చలానా ఎందుకని ప్రశ్నించాడు వెంకటేష్..
'అంతా ఓకే కానీ.. నిషేధించిన ప్లాస్టిక్ కవర్లో వీటిని దాచావు. ఇప్పుడు అర్థమైందా చలానా ఎందుకో' అడిగాడు ట్రాఫిక్ పోలీస్
షాపింగ్ చేశా అంతే...
బోనులో నిల్చున్న ముద్దాయి గంగులుని జడ్జిగారు చూశారు..
జడ్జి: ఏం తప్పు చేశావని నిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
గంగులు: షాపింగ్ చేశానని లాక్కెళ్లి కటకటాల వెనకాల వేశారు సార్..
జడ్జి: షాపింగ్ చేయడమేమీ నేరం కాదు. అసలేం జరిగిందో చెప్పు.. లేకపోతే నీకు రెట్టింపు శిక్ష విధిస్తా..
గంగులు: అంతపని చేయద్దు బాబయ్యా.. ఆ షాపు తెరవకముందే షాపింగ్ చేశానంతే (గర్వంగా సమాధానం)