Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చీకటి కురులపై
మల్లెల తారలు విరియగా,
చెలి చందమామై
వలపు వెన్నెల కురిపించు!
కడలి అలలపై
వలపు ఊయలలూగగా,
చెలి కెరటమై
నా మదిలో దోబూచులాడు!
నదుల దారులపై
అడుగులు జత కలవగా,
చెలి బుగ్గల సుడులలో
నన్ను నేను చిక్కుబడిపోయా!
వెలుగు కిరణాలపై
పయనమై కదలి రాగా
చెలి చూపులు వాలి
హృదయజ్యోతి కాంతులీను!
అడుగుల చినుకులు
ఎడారి ఎదపై కురవగా,
చెలి వెచ్చని పరిమళాలు
నా ప్రాణానికి ఊపిరి నింపు!
- పుట్టి గిరిధర్,
9491493170