Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
జిల్లాలో గత వారం వర్షం కారణంగా దెబ్బతిన్న కల్వర్టులు, బ్రిడ్జిలు వాటి స్థితిగతులపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కాగా వర్షాల సందర్భంగా బ్రిడ్జిల నిర్మాణంపై ఆరా తీశారు. జిల్లాలో అన్ని పథకముల కింద నడుస్తున్న పనులను తరగతిగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి మాన్యా నాయక్, రోడ్డు భవనాల శాఖ ఈఈ శంకరయ్య, పంచాయతీరాజ్ శాఖ ఈఈ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ లక్ష్మణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.