Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరిని కోయకుండా వదిలేసిన రైతులు
నవతెలంగాణ-నూతనకల్
మండలపరిధిలోని యడవెల్లి, తాళ్లసింగారం, చిల్లకుంట్లతో పాటు మండలపరిధిలోని అనేక గ్రామాలలో నిరంతరాయంగా పది రోజులపాటు కురిసిన అకాల వర్షానికి వరి నారు మొలిసిన పరిస్థితి ఎడవల్లిలో కనపడుతుంది. వర్షంతో పంట నూరుపిడి యంత్రాలు పొలాల్లోకి పోవడానికి వీలుకాక వరి పూర్తిగా ఎదురుగాలులకు అడ్డం పడి సగానికి పైన వడ్లు రాలిపోవడంతో ప్రస్తుతం నారుమడిలో వరి నారు మొలిచిన రీతిలో కనిపిస్తుంది. రైతులు అట్టి పొలాన్ని కోయకుండా వదిలేశారు.ఈ విషయాన్ని కొంతమంది రైతులు వ్యవసాయ అధికారులకు పలుమార్లు తెలియ పరిచినప్పటికీ మన మండలంలో భారీగా వర్షాలు కురవలేదని,నష్టపరిహారం కింద మండలాన్ని ప్రకటించలేదని రైతులకు సమాధానం చెప్పారే కానీ ఏ ఒక్క గ్రామంలో కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి విచారించి నివేదికను ఉన్నత అధికారులకు పంపిన దాఖలాలు కనబడడం లేదు.అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయిన రైతులను బాధ్యతగా ఆదుకునే అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వం అందించే నష్టపరిహారాన్ని పొందలేక పోతున్నారు.రాష్ట్రంలో అనేక జిల్లాలు మండలాలలో ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తున్నప్పటికీ ఈ మండల రైతులకు నష్టపరిహారం విచారణ చేపట్టకపోవడం శోచనీయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంట నష్టపరిహారం చెల్లించాలి
రైతు- జడిగల మల్లయ్య
మండల వ్యవసాయ అధికారులు,మండల ప్రజాప్రతినిధులు స్పందించి జిల్లా ఉన్నతాధి కారులకు దృష్టికి తెచ్చి నిరంతరంగా 10 రోజులు కురిసిన వర్షానికి పంట కోయకుండా , పొలంలో వడ్లు రాలిపోయిన వారి పొలాలను పరిశీలించేలా చర్యలు తీసుకోవాలి.నష్టపోయిన పంట పొలాలను విచారణ చేపట్టి వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.