Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువతను ఐక్యం చేసి పోరాటాలకు సన్నద్ధం కావాలి
నవ తెలంగాణ- సూర్యాపేట కలెక్టరేట్
యువతకు అండగా అఖిల భారత యువజన సమాఖ్య ఎల్లప్పు డూ ఉంటుందని భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా యువతను ఐక్యం చేసి పోరాటాలకు సన్నద్ధం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ జెండాను ఎగురవేసిన అనంతరం జిల్లా కేంద్రంలోని ఆదివారం కామ్రేడ్ ధర్మభిక్షం కార్యాలయంలో ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి బి.పి,నరేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన అఖిల భారత యువజన సమాఖ్య ద్వితీయ మహాసభ కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అయినా యువతను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పాలకులు చర్యలు చేపట్టాలన్నారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో భగత్ సింగ్, సుఖ్ దేవ్ ,రాజ్ గురు వంటి అనేకమంది మహానీయులు ప్రాణాలు తృణప్రాయంగా పెట్టి స్వాతంత్య్ర ఉద్యమ లో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఇలాంటి వారిని యువత స్పూర్తి గా తీసుకోవాలని పేర్కొన్నారు. పాలకుల నిర్లక్ష్య వైఖరి వలనే యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి పెడదారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల అవలంబిస్తున్న యువజన, విద్యా ,వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా యువత పోరాడాలని కోరారు. దేశ అభివృద్ధి లో యువత పాత్ర కీలకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలుకల శ్రీనివాస్, కార్యదర్శి చేపూరి కొండల్,సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు ,ఏఐవైఎఫ్ మాజీ నాయకులు ఖమ్మం పాటి రాము ,ఏఐఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపగాని రవికుమార్, ఏఐటీయూసీ ప్రాంతీయ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్, పాషా,తదితరులు పాల్గొన్నారు.