Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు
నవతెలంగాణ-మునగాల
వామపక్ష పార్టీల ఒత్తిడితో యూపీఏ ప్రభుత్వంలో తీసుకువచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం రద్దు చేయాలని ప్రయత్నిస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు ఆరోపించారు. ఆదివారం కృష్ణానగర్లో ఉపాధి కూలీల పని ప్రదేశాన్ని సందర్శించి మాట్లాడారు. అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఈ చట్టాన్ని కేంద్రంలో అధికారం ఉన్న మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ బడ్జెట్ కుదిస్తుందని విమర్శించారు. ఈ చట్టంలో పేద వ్యవసాయ కూలీలకు అనేక సౌకర్యాలు ఉంటే ఆ చట్టంలో ఉన్న అంశాలను సవరించి వ్యవసాయ కూలీలకు సౌకర్యాలు లేకుండా చట్టానికి ఉరివేస్తున్నారని ఆరోపించారు. కాకులను కొట్టి గద్దలకు పెట్టే చందంగా ఉపాధి హామీ చట్టాన్ని సవరించి కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల దోచిపెడుతున్నారని మండాపడ్డారు. మోడీ సర్కారు చట్టంలో తీసుకువచ్చిన సవరణల ఫలితంగా క్షేత్రస్థాయిలో కూలీలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయంలో యంత్రాలు ప్ర వేశించటంతో కూలీలకు పనులు లేక వలసలు పోతున్నారని చెప్పారు. సంవ త్సరానికి 200 రోజులు పని దినాలు రోజుకు 600 కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చట్టంలో ఉన్న అంశాల ఆధా రంగా సౌకర్యాలు అమలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపా ధ్యక్షులు సోమన్న, జానయ్య, జిల్లా ఆరే రామకృష్ణారెడ్డి, కిన్నెర వెంకన్న, లక్ష్మమ్మ, దాసరి శీను తదితరులు పాల్గొన్నారు.