Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘటన స్థలానికి చేరుకొని అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి జగదీష్ రెడ్డి
- ఎలుగుబంటిని పట్టుకున్న అధికారులు
- ఊపిరి పీల్చుకున్న సూర్యాపేట ప్రజలు
నవ తెలంగాణ-సూర్యాపేట
జిల్లా కేంద్రంలో ఎలుగుబంటి ఆదివారం హల్చల్ చేసింది.ఇంట్లోకి ప్రవేశించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పట్టణంలో డిమార్ట్ వెనకాల గల శ్రీనివాస కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనంలోకి గత శనివారం రాత్రి ప్రవేశించిదని స్థానికులు చెబుతున్నారు. ముందుగా అక్కడ స్థానికంగా నివాసం ఉంటున్న పిన్ని శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లోకి ఎలుగు బంటి ప్రవేశించిది. ఇంట్లో ఉన్న వారు చూసి భయాందోళనకు గురై కేకలు వేశారు.దాదాపుగా ఇక్కడే కొన్ని గంటల వరకు ఎలుగుబంటి నివాస ప్రాంతంలో ఉరుకులు పరుగులు పెట్టింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఎలుగుబంటి ఆ ప్రాంతం నుండి పక్కనే ఉన్న గుండగని రాములు ఇంట్లోకి ఎలుగుబంటి ప్రవేశించింది.ఇక్కడే నిర్మాణం లో ఉన్న ఇంటిలో గల బాత్ రూమ్ లోకి దూరింది.కాగా కొంతమంది బాత్ రూమ్ కు అడ్డంగా కట్టెల తడక ను ఉంచి బయటకు రాకుండా చేశారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు,అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎలుగు బంటి ని రెస్క్యూ చేయడానికి ఐదు గంటలుగా సాయంత్రం వరకు ఫారెస్ట్, పోలీసు అధికారులు శ్రమించారు. ఈ క్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి రెస్క్యూ ఆపరేషన్ ను దగ్గరుండి పర్యవేక్షించారు.త్వరగా ఎలుగుబంటి రెస్క్యూ చేసి తెస్కుకెళ్ళాలని అధికారుల ను ఆదేశించారు.ఈ మేరకు అధికారులు 6 గంటల రెస్క్యూ టీం శ్రమించి ఎట్టకేలకు ఎలుగుబంటిని బంధించారు.బంధించిన ఎలుగుబంటిని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇదిలావుండగా ఎంతో బిజీబిజీగా ఉండే జిల్లా కేంద్రంలోకి ఎలుగుబంటి ఎలా ప్రవేశించిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా కొంతమంది మాత్రం అర్వపల్లి లేక ఉండ్రుగొండ గుట్టల నుండి పట్టణంలోకి వచ్చి ఉంటుందని పేర్కొంటున్నారు. కాగా ఇంకొందరు మాత్రం ఎలుగుబంటి ని అక్రమంగా రవాణా చేస్తున్న క్రమంలో హైవే పై తప్పించుకొని పట్టణంలోకి ప్రవేశించి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా నిత్యం రద్దీగా ఉండే జిల్లా కేంద్రంలోకి ఎలుగుబంటి రావడం చర్చనీయాంశంగా మారింది.