Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టిన ఘనత కేసీఆర్ ది
- ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది
- పేద ప్రజల పెన్నిధి కేసీఆర్
నవతెలంగాణ -ఆలేరురూరల్
పార్టీకి పట్టుకొమ్మలుగా కార్యకర్తలు ఉండి కలిసికట్టుగా పని చేసినట్టయితే అధికారంలోకి వస్తుందని ఆలేరు శాసనసభ్యురాలు , ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కొల్లూరు కేసీఆర్ ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ ,ఇన్‌చార్జ్జి మామిడాల అంజయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించిన నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీసంక్షేమ ఫలితాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందన్నారు. తెలంగాణ వచ్చినాక రాకముందు అభివృద్ధిని ఏ విధంగా జరిగిందో చూడాలన్నారు. కేసీిఆర్ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం మూడింతలు పెరిగిందని గృహలక్ష్మి పథకం కూడా అమలు చేస్తామని ఇల్లు లేని నిరుపేదలకు అర్హులకు అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతంగానికి సాగునీరు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్న వ్యక్తి కెేసీఆర్ అన్నారు. బీజేపీ కేంద్రంలో ఉన్నదని చెప్పుకుంటూ ఇప్పుడు వెలువడిన ఫలితాలలో 60 సీట్లకే పరిమితమైందన్నారు. ఆలేరు మండలంలో పూర్వపు ఎండాకాలంలో పంట సాగు 3706 ఎకరాల వరి పంట సాగు చేశారు ప్రస్తుతం 10679 ఎకరాల వరి పంట సాగు చేశారు అంటే మూడింతలు పంట సాగు పెరిగిందని పేర్కొన్నారు. గతంలో ఈ మండలంలో పశువులకు గడ్డి దానా లేక నాన్న ఇబ్బందులు రైతులు పడ్డారన్నారు దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని సూచించారు యువతకు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ప్రభుత్వానికే ఉందన్నారు. ప్రజల దగ్గరికి ఓట్లు అడిగే ధైర్యం బీజేపీకి లేదన్నారు. ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయలే నాని కేంద్రం చేతులెత్తేసిన ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తామని పార్టీ చెప్పిందన్నారు. నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను తీర్చిన ఘనత కేసిఆర్ కి దక్కిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పంటలు పొలాలు పచ్చగా ఉన్నవి అంటే కేవలం రైతులు చేసుకున్న పుణ్యమన్నారు. కేంద్రం రాష్ట్రాన్ని చెడగొట్టాలని ధాన్యం కొనకపోయినా ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ మొగలగాని మల్లేశం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గ్యాధపాక నాగరాజు, యువజన విభాగం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సిరమైన వెంకటేష్, సెక్రటరీ జనరల్ రచ్చ రామ నరసయ్య, వైస్ ఎంపీపీ గాజుల లావణ్య వెంకటేష్ ,మాజీ ఎంపీపీ అనసూయ, సోషల్ మీడియా మండల కన్వీనర్ శ్రీనివాస్ ,మాజీ ఎంపీటీసీ పిక్క శ్రీనివాస్, యువజన విభాగం మండల అధ్యక్షులు కృష్ణ, గ్రామ సర్పంచులు జయమ్మ ,పద్మ ,నవ్య, లావణ్య, లక్ష్మి, శ్రీశైలం ఉప సర్పంచ్‌లు రామన్న ,మహేందర్, సత్యనారాయణ, మహేందర్ అధికార ప్రతినిధి ఆంజనేయులు ,ఎంపీటీసీ అనురాధ, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకట పాపిరెడ్డి ,మహేందర్ ,మధు, శ్రీనివాస్, మహేందర్ నాయకులు కిష్టయ్య, నర్సింలు ,రవి ,సురేష్ ,రామకృష్ణ, శోభన్, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.