Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
కర్ణాటకలో కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించినందుకు శనివారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ మండల, మున్సిపాలిటీ కమిటీల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు 65వ నెంబర్ జాతీయ రహదారిపై బాణసంచా కాల్చి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్వీట్లు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మండల, మున్సిపాలిటీ అధ్యక్షులు బోయ దేవేందర్, సుర్వి నర్సింహాగౌడ్, నాయకులు దోర్నాల శ్రీనివాస్, పన్నాల రాజిరెడ్డి, ఎర్ర విక్రమ్‌గౌడ్, నాగరాజుగౌడ్, మారగోని శేఖర్, తగరం నాగరాజు, లగ్గోని వెంకటేశ్‌గౌడ్, ఏనుగు రవీందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, శ్రీను, కేతరాజు అచ్చయ్య, ఎస్కె.యూసుఫ్, కల్లెం దయాకర్‌రెడ్డి, ఊదరి మహేశ్, దొనకొండ కృష్ణ, కందగట్ల చరణ్, బండమీది వెంకటేశ్ పాల్గొన్నారు.
బీబీనగర్:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో మండలంలోని ఆ పార్టీ నాయకులు సంబరాలను శనివారం మండల కేంద్రంలో పోచంపల్లి చౌరస్తా వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి బాణాసంచాలు కాల్చి కార్యకర్తలకు స్వీట్స్ తినిపించి ఉత్సాహం నింపారు. సఈ కార్యక్రమంలో నాయకులు పంజల రామాంజనేయులు గౌడ్, చెరుకు అచ్చయ్యగౌడ్, గోలి నరేందర్ రెడ్డి, సురకంటి సత్తిరెడ్డి, సందిగారి బసవయ్య, పంజల పెంటయ్యగౌడ్, పంజాల వెంకటేష్ గౌడ్, బద్దం వాసుదేవ రెడ్డి, గూడూరు నిఖిల్ రెడ్డి, బెండ ప్రవీణ్, సోమశివకుమార్, గోపి నాయక్, రాముల నాయక్, తదితరులు పాల్గొన్నారు.
గుండాల:కర్ణాటక రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి మతోన్మాద తిరోగమన విధానాలకు చెంపపెట్టు లాంటిదని సీపీఐ (ఎం) మండల కార్యదర్శి మద్దెపురం రాజు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 9ఏండ్ల కాలంలో మతోన్మాద విధానాలను అనుసరిస్తూ దేశంలో ఉన్న హిందూ,ముస్లిం,క్రిస్టియన్ ఇతర మతస్థులపై లైంగికదాడులు, దాడులు, దౌర్జన్యాలు, హత్యలకు పాల్పడుతూ దేశంలో ఐక్యంగా ఉన్న ప్రజల మధ్యలో చిచ్చు పెట్టిందని పేర్కొన్నారు. ప్రజల సంపదను 90శాతంగా ఉన్న దేశ ప్రజలందరికీ అందించాల్సి ఉండగా కేవలం 10 శాతంగా ఉన్న శతకోటీశ్వరులకు అప్పనంగా అక్రమంగా కట్టబెడుతుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని కారు చౌకగా అమ్మి వేస్తూ అంబానీ,ఆదానీలకు కట్టబెడుతుందని పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కోట్లాది రూపాయలను ఖర్చుపెట్టి గెలిసేందుకు బీజేపీి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందని కానీ ఆ రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని భవిష్యత్తులో కూడా జరిగే అన్ని ఎన్నికల్లో మతోన్మాద బీజేపీ ఓటమి లక్ష్యంగా సీపీఐ (ఎం) పనిచేస్తుందని పేర్కొన్నారు.
అడ్డగూడూర్ : కర్ణాటకలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన సందర్భంగా అడ్డగూడూరు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు ఒకరికొకరు తినిపిస్తూ ఆనందోత్సవాలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి నిమ్మన గోటి జోజి , వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్ , టౌన్ అధ్యక్షులు పూల పెళ్లి సోమిరెడ్డి , లక్ష్మీదేవి కాలువ గ్రామ సర్పంచ్ నారగోన అంజయ్య గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాశం సత్యనారాయణ, వల్లంబట్ల రవీందర్రావు, నర్సిరెడ్డి, గూడెపు పాండు, కడారి రమేష్, మారిశెట్టి మల్లేష్ , గజ్జి మల్లేష్ , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ :కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి , ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. ఒకరికొకరు అలాయి,బలాయి తీసుకున్నారు. బాణాసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో ఆలేరు, యాదగిరిగుట్ట ఎంపీపీ గంధమల అశోక్, చీర శ్రీశైలం , నాయకులు బాలరాజు, రమేష్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
భువనగిరి రూరల్ :కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయంపై యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర వల్ల విజయం సాధించింది అన్నారు. బీజేపీ అవినీతి వ్యతిరేకంగా ప్రజలకు పెద్ద ఎత్తున ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలోపీసీసీ కమిటీ మెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్, పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ, మండల అధ్యక్షులు కోట స్వామి, నాయకులు ఎలిమినేటి కృష్ణారెడ్డి,పాశం శివానంద్, మజహార్ , పడిగెల ప్రదీప్, ఎడ్ల శ్రీనివాస్, పాక వెంకటేశ్ యాదవ్, సలావుద్దీన్, అవేష్ చిస్తి, ఎడమ పవన్, పిట్టల బాలరాజు , కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మోత్కూర్:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శనివారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బైకులతో పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలోనూ కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు అవిశెట్టి అవిలిమల్లు, ఫైళ్ల సోమిరెడ్డి, మండల, పట్టణ అధ్యక్షులు వంగాల సత్యనారాయణ, గుండగోని రామచంద్రు, నాయకులు బద్దం నాగార్జున రెడ్డి, మలిపెద్ది మల్లారెడ్డి, కారుపోతుల శ్రీనివాస్, బుంగపట్ల యాకయ్య, ముద్ధం జయశ్రీ, రాచకొండ బాలరాజు, బందెల రవి, బుర్ర యాదయ్య, మహ్మద్ అలీ, జంగ నాగయ్య, ఉప్పలయ్య, మెంట సురేష్, అన్నెపు నర్సింహ, మెంట యాదగిరి తదితరులు పాల్గొన్నారు.