Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో ఆరు నెలల్లో కేసీఆర్ ఫామ్ హౌస్‌కు
- టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ఉద్యోగులను బెదిరించడం సరికాదని, మరో ఆరునెలల్లో రాష్ట్ర ప్రజలే కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కు పంపిస్తారని గుర్తుంచుకోవాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేశ్ రెడ్డి అన్నారు.సూర్యాపేట జిల్లాకేంద్రంలో శుక్రవారం సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్యదర్శుల శిబిరాన్ని సందర్శించి ఆయన సంఘీభావం తెలిపి ఆర్థికసాయం అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు ఉద్యమాలలో అరెస్టు కాకుండా జైళ్లకు వెళ్లలేదా అని ఎద్దేవా చేశారు.తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే తమ కలలు ఫలిస్తాయనుకున్న నిరుద్యోగులు,ప్రస్తుత కెేసీఆర్ పాలనలో తమ ఆశలు అడియాశల య్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చకపోగా సమ్మె విరమించకుంటే, మీ అంతు చూస్తామని బెదిరించడం ఏంటని ప్రశ్నించారు. సంవత్సరాల తరబడి ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోగా 9,355 గ్రామపంచాయతీ కార్యదర్శుల పోస్టులకు 8 లక్షల మంది అభ్యర్థులు పోటీపడి, సివిల్స్ పరీక్షలలో లాగా నెగిటివ్ మార్క్స్ విధానం పెట్టినప్పటికీ, కష్టపడి అర్హత సాధించిన ఉద్యోగులకు శాశ్వతఉద్యోగం ఇవ్వలేదని విమర్శించారు.3 సంవత్సరాల ప్రొబేషనరీ పిరియడ్ తర్వాత రెగ్యులర్ చేస్తామని చెప్పినకేసీఆర్మరో సంవత్సరం ప్రొబేషనరీ పీరియడ్ పెంచి కార్యదర్శులతో వెట్టి చేయించారని మండిపడ్డారు.నాలుగేండ్లు పూర్తయిన అయిన వారిని రెగ్యులర్ చేయకపోవడం దారుణమన్నారు.గ్రామపంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్ నెరవేరేవరకు కాంగ్రెస్ పక్షాన కార్యదర్శుల పోరాటానికి మద్దతు ఇస్తామని ప్రకటించారు.అనంతరం కాంగ్రెస్ పక్షాన గ్రామపంచాయతీ కార్యదర్శులకు సంఘీభావం తెలిపి రూ.30వేల ఆర్థికసాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో స్వామినాయుడు, గట్టు శ్రీనివాస్, షఫీఉల్లా, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.