Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం)లో భారీగా చేరికలు
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రజల హక్కుల కోసం నిరంతరం సమరశిలా పోరాటాలు నడుపుతున్న కమ్యూనిస్టు పార్టీలను ప్రజలు ఆదరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మిర్యాలగూడ మండలం అయిలాపురం గ్రామంలో సీపీఐ(ఎం) జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన 150 మంది సీపీఐ(ఎం)లో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జూలకంటి మాట్లాడుతూ సామాన్యులకు అండగా నిలబడి వారి సమస్య పరిష్కారానికి పాలకులతో కలబడి ఎదురోడ్డిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని పేర్కొన్నారు. దేశంలో ఫాసిస్టు విధానాలు అవలంబిస్తూ మనుషుల మధ్య మతం చిచ్చు రేపుతున్న బీజేపీని ప్రజా క్షేత్రంలో నిలబెట్టి లౌకిక భావనను నిలబెట్టి, రాజ్యాంగ పరిరక్షణకు నడిపే ప్రజాపోరాటాలలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాల అవలంబిస్తున్న ప్రభుత్వాలపై పోరాటాల నిర్వహిస్తామన్నారు. పేదల సంక్షేమమే కమ్యూనిస్టు పార్టీ లక్ష్యమని పేదల హక్కులకు సాధన కోసం నిరంతరం ఉద్యమాలు సాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, మండలనాయకులు బాబూనాయక్, నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు హనుమానాయక్, వెంకటేశ్వర్లు, సాయన్న, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.