Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీసీసీ ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డి
- రైతులతో కలిసి ఎండలో ధర్నా
నవతెలంగాణ-పెన్‌పహాడ్
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ సాకుతో రైతులను మోసం చేస్తు రెండు కేజీల ధాన్యం లూటీ చేస్తున్నారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డి విమర్శించారు. నారాయణగూడెం పిఎసిఎస్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని అనంతారం గ్రామంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బచ్చుపల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, పాలకులు కాంటాలను వేగవంతం చేసి తరలిస్తున్నామన్నది క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని, గత నాలుగు రోజులుగా తేమ సాకుతో కాంటాలు వేయడం లేదన్నారు. బస్తాకు రెండు కేజీలు కటింగ్ చేస్తున్నారని పిఎసిఎస్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. చరవాణి ద్వారా కలెక్టర్ హామీతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గద్దల నాగరాజు, ఉపసర్పంచ్ మామిడి మైసయ్య, మండలి పిచ్చయ్య, శ్రీరాములు, గొర్ల అంజయ్య, మామిడి శ్రీనివాస్, వెంకన్న, రవి, సత్యం, రాజు, వెంకటేశ్వర్లు, షేక్ జానీ, రంగారెడ్డి, షఫీ ఉల్లా తదితరులు పాల్గొన్నారు.