Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తంగిరాల చక్రవర్తి , 9393804472
భారత రాజ్యాంగాన్ని, స్వాతంత్య్రాన్ని, సమైక్యతనూ నేడు ప్రమాదంలోకి కేంద్రప్రభుత్వం బిజెపి నెట్టేస్తోంది. కార్పొరేట్, సామ్రాజ్యవాద శక్తుల ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. ఆర్.ఎస్.ఎస్. శక్తుల లక్ష్యాలు, నిర్మాణం, దాని పని విధానం, హిందూరాజ్య స్థాపన తన రహస్య ఎజెండాని పర్యావలోకనం చేయాలి. ఆర్.ఎస్.ఎస్. హిందూత్వం పై భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) ఒక నోట్ తయారు చేయాలని 23వ మహాసభ నిర్ణయం మేరకు రాజకీయ తరగతుల్లో బోధించేందుకు ఈ పుస్తకం తీసుకొచ్చారు.
1925 విజయదశమి రోజున డా||బి.ఎస్.ముంజి, డా||ఎల్.వి.పరాంజపే, డా||కె.బి.హెడ్గేవార్, డా||హోల్కర్, విడిసావర్కర్లు ఆర్.ఎస్.ఎస్ స్థాపించారు. ఇది జాతీయోద్యమంలో పాల్గొనకపోవడం, ముస్లింలపై ద్వేషంతో వార్ని ఎదుర్కోవడం, హిందూరాష్ట్ర ఏర్పాటు లక్ష్యాలుగా ఏర్పడింది. గోల్వాల్కర్ ఐదు స్వభావాలు ఉండాలని సూత్రీకరించాడు. భౌగోళిక సరిహద్దులు (దేశం), జాతి, మతం, భాష, సంస్కృతి అంతా భారతదేశంలో హిందువులకే ఈ స్వభావాలన్నీ వున్నాయని, అందువల్ల ఈ దేశం హిందువులదే అని సిద్దాంతీకరణ చేశారు.
ఆర్.ఎస్.ఎస్ సిద్దాంతమంతా 'ముస్లిం - క్రిస్టియన్ - కమ్యూనిస్టుల వ్యతిరేకత పైనే ఆధారపడి వుంటుంది. అది పూర్తిగా ఫాసిస్టు స్వభావం కలిగి వుంది.
'సంస్కృతి' పేరు మీద సాంస్కృతిక జాతీయ వాదాన్ని ముందుకు తెస్తూ తన ప్రియమైన మతతత్వ వాదాన్ని ఆ ముసుగులో దాచే ప్రయత్నం చేస్తున్నది. హిందుత్వాన్ని స్వీకరించడం, దాన్ని వ్యతిరేకిస్తే అది దేశద్రోహం. వేదాల పట్ల ప్రాచీన గ్రంధాల పట్ల గుడ్డి నమ్మకాన్ని ఆర్.ఎస్.ఎస్. పెంచుతుంది. పురాణాలను చరిత్రగా బోధిస్తుంది. హిందూ మహాసభకు చెందిన గాడ్సే, గాంధీని హత్య చేశాడు. అందులో సావర్కర్ కూడా దోషి. 1948లో ఆర్.ఎస్.ఎస్. నిషేధం, ఎమర్జెన్సీలో సంజరుగాంధీతో పనిచేయడం, 1979లో 13,000 శాఖలుగా విస్తరణ, 2019కి 59,266 శాఖల విస్తరణ. హిందూత్వానికై పని చేయడం.. ఇలా ఆర్.ఎస్.ఎస్ అనుబంధ సంస్థలు, వాటి నీచ రాజకీయాల గురించి ఈ పుస్తకంలో తెలుసుకోగలం. వామపక్ష, లౌకికవాద, ప్రజాతంత్ర - ప్రగతిశీల కార్యకర్తలకు రాజకీయ అవగాహన కలిగించే చక్కటి కరదీపిక ఈ పుస్తకం.
ఆర్.ఎస్.ఎస్, హిందూత్వ ఫాసిస్టు ప్రమాదం, అనువాదం : కె.ఉషారాణి, పేజీలు : 64, వెల : 50/-, ప్రతులకు : నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్, ఎం.హెచ్.భవన్, ప్లాట్ నెం.21/1, ఆజమాబాద్, ఆర్.టి.సి.కళ్యాణ మండపం దగ్గర, హైదరాబాద్-500020.