Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దిలీప్ రెడ్డి, నందిపేట రవీందర్, శిరమని నరేష్, కమ్మారి అలెగ్జాండర్, భమిడిపాటి గౌరిశంకర్, డా||భాస్కరరావు నాగులపల్లి, నజీర్, మాడభూషి శ్రీధర్, విద్య వెంకట్ - రాజశేఖర్, వి.బి.జె చెలికాని, జి.నాగేశ్వరరావు, ఈనాడు రామోజీరావు, జయప్రకాష్ నారాయణ్ (లోక్సత్తా) లాంటి ప్రముఖుల సాహితీ సామాజిక కృషిని గురించి ఈ పుస్తకంలో రాశారు. 87 సంవత్సరాల వయసులో 'ఉగోరా' పేరుతో కవి గోపాలరావు కవిత్వం రాయడం, 75 సంవత్సరాల స్వరాజ్యంలోని ప్రభుత్వాలు, బాధ్యతగా చట్టబద్దంగా నడుచుకునే పౌర సమాజాన్ని తీర్చి దిద్దలేదు అనే ఆవేదనలోంచి జాలు వారినవే ఈ కవితలు. వీరు ఇప్పటికే 4 పుస్తకాలు రాశారు. ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాగం, ప్రజాస్వామ్యం, చట్టబద్ద పాలన గురించి సామాజిక స్పృహతో ఈ కవితలు రాశారు. కొన్ని చోట్ల అస్పష్టత అగుపిస్తుంది. ఇ.డి. దాడులు అభినందనీయం అంటారు 'అక్రమార్జన సంస్కృతిపై దాడులు' అనే కవితలో. కానీ రాజకీయంగా విభేదించే వారిపై, వారి సంస్థలపై బెదిరింపులు, వార్ని లొంగదీసుకోవడం, పార్టీల ఫిరాయింపులకు ఆయుధాలైన వైనం మనం నిత్యం పేపర్లలో చూస్తున్నాం కదా. ప్రజా సాహిత్యం అనే కవితలో (పేజీ 23) ఇలా రాశారు ''పాలకుల తప్పిదాలను అద్దంలో చూపించే సాహిత్యం కావాలి. పాలనా యంత్రాంగ నిర్లక్ష్య వైఖరిని నిలదీసే సాహిత్యం కావాలి'' అంటారు.
అలాగే 'అసంతృప్తి పాలన' అనే కవితలో చివరి వాక్యాలు ఆలోచింపజేస్తాయి. ''ఓట్లు /సీట్లకే పరిమితమై/ చట్టబద్దమైన పాలనకు, పారదర్శకతతో కూడిన పాలనకు/ బాధ్యతాయుతమైన పాలనకు, ప్రాధాన్యం తగ్గించాయి ఈనాటి పాలక పార్టీలు/ అందుకే ఈ అసంతృప్తి పాలన'' (పేజీ 11) అంటారు. బానిస, రాజరిక, ప్రజాస్వామ్య పాలన గురించి రాస్తూ 'కాలచక్రం' కవితలో (పేజీ 15) ''మళ్ళీ ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ నుండి / రాచరిక వ్యవస్థ వైపు/ అడుగులు వేస్తున్నాం. బానిస బ్రతుకు వద్దనుకున్న మనం/మోడరన్ బానిసలు వైపుగా/ పయనిస్తున్నాం'' అన్నారు. ప్రశ్నించే తత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఆదర్శ పౌర జీవితాన్ని, శూన్యతని అధిగమించడం, నిద్రావస్త, నిర్లప్తత వీడి చైతన్యం పొందాలనే తపన చాలా కవితల్లో కనిపిస్తుంది. 'కరోనా, లాక్డౌన్, పివి, సుప్రీం కోర్టు వ్యాఖ్యలు, దిగులు దేవత, అంబేద్కర్ కలలుగన్న రాజ్యం ఇదేనా? జ్ఞాపకాలు, పిచ్చ, (అక్రమార్జన, మత పిచ్చ, సమాజానికి ప్రమాదాలే) పాలకులా పెత్తందారులా?, బలమే మూలం, గాడి తప్పిన ప్రజాస్వామ్యం' లాంటి కవితలు ఆలోచింపజేస్తాయి.
నా మాటల (భావాల) మూట, కవి : ఉప్పల గోపాలరావు, పేజీలు : 62, ప్రతులకు : ఉప్పల గోపాలరావు, బ్లాక్ -15, ప్లాట్ - 107, రెయిన్ ట్రే పార్క్, మలేషియా టౌన్ షిప్, కె.పి.హెచ్.పి. హైదరాబాద్ - 500085, ఫోన్ : 9440053099
- తంగిరాల చక్రవర్తి , 9393804472