Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను పెళ్లాడబోతున్నాడు. ఈ విషయాన్ని చహల్ స్వయంగా ప్రకటించాడు. గత కొంతకాలంగా ధనశ్రీతో చహల్ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చని విషయం తెలిసిందే. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు కూడా గ్రీన్ సిగల్ ఇవ్వడంతో పెండ్లి ముహుర్తం ఖరారు చేసేందుకు శనివారం రోకా వేడుకను సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ రోకా కార్యక్రమంలో ధనశ్రీతో కలిసిన ఉన్న ఫొటోను చహల్ షేర్ చేస్తూ.. 'అవును మేమీద్దరం పెండ్లి చేసుకోబు తున్నాం. ప్రస్తుతం మా కుటుంబాలతో కలిసి 'రోకా' కార్యక్రమంలో సందడి చేస్తున్నాం' అంటూ చహల్ ట్వీట్ చేశాడు. ఈ ఫొటోలో సంప్రదాయ దుస్తుల్లో ఉన్న చహల్, ధనశ్రీలను చూసిన నెటిజన్లు 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అంటూ కామెంట్లు చేస్తున్నారు.