Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి రౌండ్లో అలవోక విజయాలు
- వీనస్, గోఫిన్లకు చుక్కెదురు
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2020
పారిస్ (ఫ్రాన్స్) : బర్త్ డే గర్ల్, టాప్ సీడ్ సిమోన హలెప్ మట్టి కోర్టులో మంచి ఆరంభం దక్కించు కుంది. ఆదివారం ఆరంభమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ ఫేవరేట్లు సిమోన హలెప్ (రోమానియా), పదో సీడ్, బెలారస్ భామ విక్టోరియా అజరెంకలు శుభారంభం చేశారు. ఆదివారం జరిగిన తొలి రౌండ్ మ్యాచుల్లో స్టార్స్ అల వోక విజయాలు నమోదు చేశారు. సిమోన హలెప్ 6-4, 6-0తో వరుస సెట్లలో స్పెయిన్ అమ్మాయి సోరిబెస్ టోర్మోపై వరుస సెట్లలో గెలు పొందింది. తొలి సెట్లో ప్రత్యర్థికి నాలుగు గేములు కోల్పోయిన హలెప్.. రెండో సెట్లో ఒక్క గేమ్ కూడా స్పెయిన్ అమ్మాయికి ఇవ్వలేదు. 6-0తో ఏకపక్షంగా రెండో సెట్‌ను సొంతం చేసుకుంది. సిమోన హలెప్.. సారా సర్వ్‌ను ఆరుసార్లు బ్రేక్ చేయగా, హలెప్ సర్వ్‌ను సారా రెండు సార్లు మాత్రమే బ్రేక్ చేయగల్గింది. బెలారస్ భామ విక్టోరియా అజరెంక 6-1, 6-2తో సులువుగా రెండో రౌండ్‌కు చేరుకుంది. మోంటోనిగ్రో అమ్మాయి డాంక కోవినిక్పై నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించిన అజరెంక పూర్తి ఆధిపత్యం చెలాయించింది. వెటరన్ క్రీడాకారిణి, దిగ్గజ సెరెనా విలియమ్స్ అక్క వీనస్ విలియమ్స్ కథ తొలి రౌండ్లోనే ముగిసింది. స్లోవేకియా అమ్మాయి అనా కరోలినా చేతిలో 4-6, 4-6తో వీనస్ విలి యమ్స్ వరుస సెట్లలో పరాజయం పాలైంది. వీనస్ సర్వ్‌ను ఆరు సార్లు బ్రేక్ చేసిన అనా సీనియర్ క్రీడాకారిణి పోరుకు ముగింపు పలికింది. నాలుగు ఏస్‌లతో పాటు నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించినా వీనస్ విలియమ్స్ రెండో రౌండ్‌కు చేరుకోలేక పోయింది. ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఆస్ట్రా శర్మ 6-2, 2-6, 7-5తో రష్యా అమ్మాయి అనా బ్లింకోవాపై గెలుపొందింది. మూడు సెట్ల మ్యాచ్ లో కంగారూ క్రీడాకారిణి టైబ్రేకర్‌లో పైచేయి సాధించి రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. జర్మనీ ప్లేయర్ అనా లినా ఫ్రీడ్‌సమ్ 2-6, 6-2, 3-6తో మూడు సెట్ల మ్యాచ్‌లో అలిసాండ్ర చేతిలో ఓటమి చెందిం ది. 27 సీడ్, రష్యన్ ప్లేయర్ ఎకర్టినా అలెగ్జాండ్రోవ 6-3, 6-3తో ఆసీస్ అమ్మా యి మడిసన్ ఇంగ్లిస్‌పై విజయం సాధించింది.
డెవిడ్ గోఫిన్ అవుట్
పురుషుల సింగిల్స్‌లో జాన్ సిన్నర్ 7-5, 6-0, 6-3తో వరుస సెట్లలో 11వ సీడ్ బెల్జియం ఆటగాడు డెవిడ్ గోఫిన్కు షాకిచ్చాడు. తొలి సెట్లో 5-7తో ఓటమిపాలైన గోఫిన్.. రెండో సెట్లో చేతులెత్తేశాడు. మూడో సెట్ల ోనూ ఆశించిన రీతిలో పుంజుకోలేదు. ఇస్నర్ అద్భుత ఆటతీరుతో రెండో రౌండ్లోకి చేరుకున్నాడు. అమెరికా ఆటగాడు జాన్ ఇస్నర్ 6-4, 6-1, 6-3తో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆటగాడిపై అలవోక విజయం సాధించాడు. క్వాలిఫయర్ అండ్రీయస్ సెప్పి 2-6, 6-4, 3-6, 3-6తో సెబాస్టియన్ కోర్డా చేతిలో ఓటమిపాలయ్యాడు. ఐదు సెట్ల మారథాన్ మ్యాచ్‌లో అమెరికా ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్ 7-5, 7-(7-2), 1-6, 2-6, 6-3తో థామస్ మచాక్పై పైచేయి సాధించాడు. తొలి రెండు సెట్లను టైబ్రేకర్‌లో కోల్పోయిన రష్యా ఆటగాడు.. మూడు, నాలుగు సెట్లలో విజయంతో మ్యాచ్‌ను నిర్ణయాత్మక ఐదో సెట్‌కు తీసుకెళ్లాడు. కానీ అక్కడ టేలర్‌ను అడ్డుకోలేకపోయాడు.