- ఛేదనలో చెన్నైపై అజేయ సెంచరీ - ఢిల్లీ క్యాపిటల్స్ అలవోక విజయం షార్జా : శిఖర్ ధావన్ (101 నాటౌట్, 58 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో చెలరేగాడు. 180 పరుగుల ఛేదనలో శిఖర్ ధావన్ శతకంతో ఢిల్లీ క్యాపిటిల్స్ ఆఖరు ఓవర్లో ఐదు వికెట్ల తేడాతో విజయం అందుకుంది. ఓపెనర్ పృథ్వీ షా (0), అజింక్య రహానె (8)లను త్వరగా అవుట్ చేసిన చెన్నై బౌలర్లు.. ఢిల్లీని ఒత్తిడిలోకి నెట్టారు. శ్రేయాష్ అయ్యర్ (23), మార్కస్ స్టోయినిస్ (24)లు నిష్క్రమించినా.. ధావన్ మరో ఎండ్‌లో నిలిచి గెలిపించాడు. సీజన్‌లో ఢిల్లీ ఏడో విజయం సాధించగా.. చెన్నైకి ఇది ఆరో ఓటమి. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్‌కింగ్స్ డుప్లెసిస్ (58), అంబటి రాయుడు (45), జడేజా (33) రాణించటంతో తొలుత 179/4 స్కోరు చేసింది.