Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం
న్యూఢిల్లీ : భారత క్రికెట్ దిగ్గజం, 1983 ప్రపంచకప్ గెలుపు గుర్రాల రథ సారథి కపిల్ దేవ్‌కు గుండెపోటు వచ్చింది. 61 ఏండ్ల కపిల్ దేవ్ క్రికెట్‌కు దూరమైనా.. గోల్ఫ్ కోర్టులో చురుగ్గా కనిపిస్తాడు. బయట కూడా కపిల్ దేవ్ ఎనర్జిటిక్‌గా ఉంటారు. గురువారం ఛాతిలో ఆయాసంగా అనిపిస్తే కపిల్ దేవ్‌ను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం కపిల్ దేవ్ ఆరోగ్యం నిలకడగా ఉందని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. 'కపిల్ దేవ్ ప్రస్తుతం బాగానే ఉన్నారు. ఆయన భార్యతో మాట్లాడాను. గురువారం కపిల్ కాస్త ఆయాసంగా ఉన్నారు. హాస్పిటల్‌కు ఇప్పుడు ఆయనకు పలు పరీక్షలు చేస్తున్నారు' అని బారత క్రికెటర్ల సంఘం అధ్యక్షుడు అశోక్ మల్హోత్రా తెలిపారు. ' కపిల్ దేవ్ గుండెపోటుతో బాధపడ్డారు. అత్యవసర కరోనరీ ఎంజియోప్లాస్టీ పరీక్షతో ఆయన ఆరోగ్య స్థితిని అంచనా వేశాం. కపిల్ దేవ్‌కు అర్థరాత్రి ఈ పరీక్ష నిర్వహించాం. ప్రస్తుతం ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో డా. అతుల్ మాథూర్ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. రెండు రోజుల్లో కపిల్ దేవ్‌ను డిశ్చార్జ్ చేయనున్నాం' అని హాస్పిటల్ హెల్త్ బులెటిన్‌తో పేర్కొన్నది. కపిల్ దేవ్ వేగంగా కోలుకోవాలని సోషల్ మీడియాలో క్రికెటర్లు, అభిమానులు, క్రీడాకారులు ఆకాంక్షించారు. భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, బాక్సర్ విజేందర్ సింగ్, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్, బీసీసీఐ కార్యదర్శి జై షా, క్రికెట్ జెంటిల్మెన్ అనిల్ కుంబ్లే, సురేశ్ రైనా, మదన్‌లాల్, మహ్మద్ కైఫ్, క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లేలు ట్విట్టర్ వేదికగా కపిల్ దేవ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ' నేను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన, ప్రేమ చూపిన అందరికీ ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులతో సంతోషించాను. మంచిగా కోలుకుంటున్నాను' అని కపిల్ దేవ్ శుక్రవారం సాయంత్రం ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తెలిపాడు.