Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెలరేగిన డెవిడ్ వార్నర్
- హైదరాబాద్ 219/2
దుబారు (యుఏఈ)
హైదరాబాద్ అదరగొట్టింది. వృద్దిమాన్ సాహా ఓపెనర్‌గా సూపర్ హిట్ కొట్టాడు. వృద్దిమాన్ సాహా (87, 45 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), డెవిడ్ వార్నర్ (66, 34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. బలమైన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ దళంపై దండయాత్ర చేసిన వార్నర్, సాహా, మనీశ్ పాండే (44 నాటౌట్, 31 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్)లు హైదరాబాద్‌కు భారీ స్కోరు అందించారు. నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 219 పరుగులు చేసింది. వరుసగా 25 టీ20ల్లో వికెట్ల వేట సాగించిన కగిసో రబాడ.. ఆరెంజ్ ఆర్మీ దెబ్బకు ఈ మ్యాచ్‌లో 0/54తో నిరాశపరిచాడు.
సాహా సర్ప్రైజ్ : టాస్ నెగ్గి ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుని ఆశ్చర్యపరచగా.. సక్సెస్ఫుల్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టోను బెంచ్‌కు పరిమితం చేసి హైదరాబాద్ షాక్ ఇచ్చింది. కీలక మ్యాచ్‌లో వృద్దిమాన్ సాహాను ఓపెనింగ్ జోడీగా ఎంచుకున్న డెవిడ్ వార్నర్ ఢిల్లీపై మెరుపు దాడి చేశాడు. ఆరంభంలో ఎన్రిచ్ నోర్జె, కగిసో రబాడలను ప్రయోగించినా.. వార్నర్, సాహాలు వారిని ఉతికారేశారు. పవర్ ప్లేలో 77 పరుగులు చేసిన హైదరాబాద్.. అదే జోరు కొనసాగించింది. ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో వార్నర్ అర్థ సెంచరీ సాధించాడు. బెయిర్‌స్టో తోడుగా నెమ్మదిగా ఆడిన వార్నర్ ఢిల్లీపై ఆది నుంచీ ఎదురుదాడే చేశాడు. 8 ఫోర్లతో 27 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన సాహా.. తర్వాత నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో కదం తొక్కాడు. వార్నర్, సాహా నిష్క్రమించినా హైదరాబాద్ జోరు తగ్గలేదు. ఓవర్‌కు 11-12 రన్‌రేట్‌తో పరుగుల వరద పారించింది. ఆఖర్లో మనీశ్ పాండే (44 నాటౌట్), కేన్ విలియమ్సన్ (10 నాటౌట్)లు భారీ స్కోరు అందించారు. ఢిల్లీ బౌలర్లలో నోర్జె, అశ్విన్‌లు చెరో వికెట్ తీసుకున్నారు. రబాడ, అక్షర్ పటేల్, తుషార్ దేశ్‌పాండే, మార్కస్ స్టోయినిస్‌లకు వికెట్ దక్కలేదు.
స్కోరు వివరాలు :
హైదరాబాద్ ఇన్నింగ్స్ : డెవిడ్ వార్నర్ (సి) అక్షర్ పటేల్ (బి) రవిచంద్రన్ అశ్విన్ 66, వృద్దిమాన్ సాహా (సి) శ్రేయస్ అయ్యర్ (బి) ఎన్రిచ్ నోర్జె 87, మనీశ్ పాండే నాటౌట్ 44, కేన్ విలియమ్సన్ నాటౌట్ 11, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (20 ఓవర్లలో 2 వికెట్లకు) 219.
వికెట్ల పతనం : 1-107, 2-170.
బౌలింగ్ : ఎన్రిచ్ నోర్జె 4-0-37-1, కగిసో రబాడ 4-0-54-0, అశ్విన్ 3-0-35-1, అక్షర్ పటేల్ 4-0-36-0, తుషార్ దేశ్‌పాండే 3-0-35-0, మార్కస్ స్టోయినిస్ 2-0-15-0.