Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో థీమ్ వర్సెస్ మెద్వదేవ్
- ఏటీపీ టూర్ ఫైనల్స్
లండన్ (ఇంగ్లాండ్) : అంచనాలు తలకిందులు. వరుసగా రెండు సెమీఫైనల్స్‌లో ఫేవరేట్లకు భంగపాటు. ఏడాది చివర్లో జరిగే ఏటీపీ టూర్ ఫైనల్స్‌లో టైటిల్ పోరుకు చేరుకుంటారనుకున్న వరల్డ్ నం.1 నొవాక్ జకోవిచ్ (సెర్బియా), వరల్డ్ నం.2 రఫెల్ నాదల్ (స్పెయిన్) సెమీస్ నుంచే నిష్క్రమించారు. ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థీమ్ చేతిలో జకోవిచ్‌కు పరాభవం ఎదురుకాగా, రష్యా స్టార్ డానిల్ మెద్వదేవ్ చేతిలో స్పెయిన్ బుల్ మట్టికరిచాడు. దీంతో ఆదివారం అర్థరాత్రి జరిగే టైటిల్ పోరులో వరల్డ్ నం.3 థీమ్‌తో వరల్డ్ నం.4 మెద్వదేవ్ పోటీపడనున్నాడు. రెండో సెమీఫైనల్లో నాదల్కు అనూహ్య ఓటమి ఎదురైంది. తొలి సెట్‌ను 6-3తో సులువుగా నెగ్గిన నాదల్కు రెండో సెట్లో గట్టి పోటీ ఎదురైంది. టై బ్రేకర్‌కు దారితీసిన రెండో సెట్‌ను 7-4తో గెల్చుకున్న మెద్వదేవ్ మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో సెట్‌కు తీసుకెళ్లాడు. మూడో సెట్‌ను 6-3తో సులువుగా సొంతం చేసుకున్న రష్యా ఆటగాడు ఫైనల్లోకి ప్రవేశించాడు. 6-3, 6-7(4-7), 3-6తో రఫెల్ నాదల్ టైటిల్ వేటకు సెమీస్‌లోనే తెరపడింది. అంతకముందు మరో సెమీఫైనల్లో డొమినిక్ థీమ్ చేతిలో నొవాక్ జకోవిచ్ 5-7, 7-6(12-10), 6-7(5-7)తో పరాజయం చెందాడు.