Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాన్ బెర్రాలో నేడు మూడో వన్డే
- క్లీన్ స్వీప్ విజయంపై ఆస్ట్రేలియా గురి
- ఊరట విజయం వేటలో విరాట్‌సేన
- ఉ 9.10 నుంచి సోనీ సిక్స్‌లో ప్రసారం..
వన్డే సిరీస్‌లో వేదిక మారింది. మరి, ఫలితం మారుతుందా? సిడ్నీలో వరుసగా ఎదురులేని విజయాలు సాధించిన ఆస్ట్రేలియా అక్కడే సిరీస్‌ను సొంతం చేసుకుంది. భారీ స్కోర్ల చిరుమానా కాన్బెర్రాలో నేడు మూడో వన్డే జరగనుంది. టాస్ ప్రధాన భూమిక వహిస్తున్న సమయంలో, టీమ్ ఇండియా టాస్ కలిసొస్తే నేడు ఊరట విజయం దిశగా దూసుకెళ్లనుంది. భీకర ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా మరో భారీ స్కోరు, భారీ విజయంతో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది.
కాన్బెర్రా (ఆస్ట్రేలియా)
భారత్ వన్డే విజయం రుచి చూసి ఐదు వన్డేలు గడిచిపోయింది. చివరగా 2016లో ఇలా వరుసగా ఐదు వన్డేల్లో భారత్ పరాజయం చవిచూసింది. ఆస్ట్రేలియాలోనే ఆఖరు వన్డేలో బుమ్రా అరంగ్రేట మ్యాచ్‌లో మెరుపు విజయంతో పరాజయాల పరంపరను ఆరో వన్డేకు కొనసాగించలేదు. విరాట్ కోహ్లి నేడు విజయంతో చెత్త రికార్డుకు నో చెబుతుందా? అర డజను పరాజయాలతో జట్టు ఆత్మవిశ్వాసం మరింత దిగజారేలే చేస్తాడా? ఆసక్తికరం. ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాను మరింత దెబ్బకొట్టేందుకు క్లీన్‌స్వీప్ విజయమే సరైనదని కంగారూలు భావిస్తున్నారు. కొండంత స్కోర్ల వేదిక కాన్బెర్రా అందుకు సహకరించేందుకు సిద్ధంగా ఉంది. జోరుమీదున్న ఆస్ట్రేలియా నుంచి విరాట్ కోహ్లి వైట్‌వాష్ ప్రమాదం నుంచి తప్పించుకోగలదా?! చూడాలి.
మయాంక్ మెరుస్తాడా? : ఐపీఎల్లో భీకర ఫామ్‌లో పరుగులు రాబట్టిన మయాంక్ అగర్వాల్ వన్డే జట్టులోకి వచ్చాడు. రోహిత్ శర్మ స్థానంలో ధావన్ తోడుగా ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నాడు. తొలి రెండు వన్డేల్లో మయాంక్ మెరుపు ఆరంభాలు సాధించినా, భారీ స్కోర్లు సాధించలేకపోయాడు. వన్డేల్లో మయాంక్ స్ట్రయిక్‌రేట్ 103.61. అత్యధిక స్కోరు 32 మాత్రమే. వన్డే జట్టు దీర్ఘకాల ప్రణాళికల్లో భాగం కావాలంటే, అతడు తక్షణమే ఓ భారీ స్కోరుతో సత్తా చాటాల్సి ఉంది. కాన్బెర్రా వంటి ఫ్లాట్ పిచ్‌పై మయాంక్‌కు అది సులువే. గత మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఫామ్‌లోకి వచ్చినా, జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లలేకపోయాడు. ఇక్కడ భారీ స్కోర్లు చేయడానికి, భారీ లక్ష్యాలు ఛేదించేందుకు ఇకరిద్దరు రాణిస్తే సరిపోదు. బ్యాటింగ్ లైనస్ సమష్టిగా కదం తొక్కాలి. మిడిల్ ఆర్డర్లో శ్రేయాస్ అయ్యర్ సైతం భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. టెస్టు సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని మహ్మద్ షమి, జశ్‌ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి లభించే అవకాశం ఉంది. షార్దుల్ ఠాకూర్, టి.నటరాజన్ సహా కుల్దీప్ యాదవ్‌లకు నేడు బరిలోకి దిగే చాన్స్ దక్కనుంది. వైట్‌వాష్ ఓటమిని నిలువరించేందుకు నేడు కోహ్లిసేన ఏం చేస్తుందో చూడాలి.
అయినా, ప్రమాదరకమే : మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఇద్దరు కీలక ఆటగాళ్లను కోల్పోయింది. నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఇది పెను ప్రభావం చూపించి ఉండేది. కానీ ఇప్పటికే సిరీస్ విజయం సాధించిన ఆస్ట్రేలియా నేడు ఎలాగైనా ప్రయోగాలకు మొగ్గుచూపేది. ప్రమాదకర ఓపెనర్ డెవిడ్ వార్నర్, ప్రధాన సీమర్ పాట్ కమిన్స్‌లు నేడు ఆడటం లేదు. ఈ ఇద్దరి స్థానంలో మాథ్యూ వేడ్, సీన్ అబాట్‌లు నేడు తుది జట్టులోకి రానున్నారు. భారత్‌పై తడబడుతున్న మిచెల్ స్టార్క్ కాన్బెర్రాలో భిన్నంగా ఆలోచన చేయాలనుకుంటున్నాడు. స్టీవ్ స్మిత్, అరోన్ ఫించ్, లబుషేన్, మాక్స్‌వెల్‌లు భీకర ఫామ్‌లో ఉన్నారు. కాన్బెర్రా పిచ్‌పై వీరిని అడ్డుకోవటం భారత్‌కు తలకు మించిన భారమే కానుంది.
పరుగుల వరదే : సిడ్నీలో రెండు వన్డేల్లోనూ భారీ స్కోర్లు నమోదయ్యాయి. కాన్‌బెర్రాలోనూ పరుగుల ప్రవాహం ఉండనుంది. ఇక్కడా తొలుత బ్యాటింగ్ చేసిన జట్టునే విజయం వరించేందుకు అధిక అవకాశాలు ఉన్నాయి. 372/2, 411/4, 348/8, 378/5.. ఇవీ గత నాలుగు మ్యాచుల్లో ఇక్కడ నమోదైన తొలి ఇన్నింగ్స్ స్కోర్లు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోనుంది.
తుది జట్లు (అంచనా)
భారత్ : మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, షార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమి, నటరాజన్, కుల్దీప్ యాదవ్.
ఆస్ట్రేలియా : అరోన్ ఫించ్ (కెప్టెన్), మాథ్యూ వేడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, మోయిసిస్ హెన్రిక్స్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా, జోశ్ హజిల్‌వుడ్.
6.36: ఈ శతాబ్దంలో వన్డేలకు ఆతిథ్యం ఇచ్చిన అన్ని స్టేడియాల్లో అత్యధిక రన్‌రేట్, పరుగుల ప్రవాహం కాన్బెర్రాలోనే జరిగింది. ఇక్కడ మానుకా ఓవల్‌లో సగటున ఓవర్‌కు 6.36 పరుగులు వచ్చాయి.
23: వన్డేల్లో 12000 పరుగుల మైలురాయి చేరుకునేందుకు విరాట్ కోహ్లికి మరో 23 పరుగులు అవసరం. కాన్బెర్రాలో కోహ్లి 23 పరుగులు చేయగలిగితే 242 ఇన్నింగ్స్‌లోనే 12 వేల పరుగులు చేసిన ఘనత దక్కించుకుంటాడు. సచిన్ టెండూల్కర్ 300 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును సాధించాడు.