Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూజిలాండ్ 243/2
హామిల్టన్ (న్యూజిలాండ్) : కేన్ విలియమ్సన్ (97 నాటౌట్, 219 బంతుల్లో 16 ఫోర్లు) అజేయ ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్‌తో తొలి టెస్టులో న్యూజిలాండ్ తొలి రోజు పైచేయి సాధించింది. ఓపెనర్ విల్ యంగ్ (5) ఆరంభంలోనే వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్ టామ్ లేథమ్ (86, 184 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి విలియమ్సన్ 154 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొన్న విలియమ్సన్ తొలి రోజు సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచాడు. లేథమ్‌ను కీమర్ రోచ్ అవుట్ చేసినా.. రాస్ టేలర్ (31 నాటౌట్, 61 బంతుల్లో 5 ఫోర్లు)తో కలిసి విలియమ్సన్ న్యూజిలాండ్‌ను భారీ స్కోరు దిశగా నడిపిస్తున్నాడు. బ్యాటింగ్‌కు ముందు మోకాలి కూర్చోని 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' ఉద్యమానికి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మద్దతు పలికాడు. తొలి రోజు ఆటలో 78 ఓవర్లు మాత్రమే సాధ్యపడ్డాయి. నేడు ఓ అరగంట ముందుగా ఆట ఆరంభం కానుంది. వెస్టిండీస్ బౌలర్లలో జేసన్ హౌల్డర్, జోసెఫ్, ఛేజ్, బ్రాత్వేట్లకు వికెట్ దక్కలేదు.