బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా) :టెస్టు క్రికెట్‌లో ఇది కఠినమైన రోజు. రిషబ్ పంత్ సహా భారత జట్టు అంతా అద్భుతంగా ఆడింది అని ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ అన్నాడు. సిరీస్ విజయానికి భారత్ అర్హమైన జట్టు. పిచ్‌పై పగుళ్లను వాడుకుని మరికొన్ని ట్రిక్‌లు ప్రయత్నించేవాడిని. గబ్బాది మంచి వికెట్. ఒక్కసారి క్రీజులో నిలిస్తే పరుగులు సులువుగా వస్తాయి. బ్రిస్బేన్, సిడ్నీలో ఆఖరు రోజు ఆస్ట్రేలియావి. కానీ మేము చాలినన్ని వికెట్లు పడగొట్టలేదు. ఓవరాల్‌గా నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను'